Balakrishna-Charmy: ఛార్మీతో బాలయ్య ఆసక్తికర వ్యాఖ్యలు..!అన్నీ చేసేశాకే ఇలా అంటూ..!
Balakrishna-Charmy: నందమూరి నటసింహం బాలయ్య జోష్ మామూలుగా లేదు. ఓ వైపు తను నటించిన అఖండ మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. బోయపాటి దర్శకత్వంలో వచ్చిన ఈ సినిమాలో బాలయ్య తన నట విశ్వరూపాన్ని చూపించాడు. దీంతో థియేటర్లకు ఆడియన్స్ క్యూ కట్టారు. బాలయ్య కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ ఇచ్చారు. తొలిసారిగా వంద కోట్ల క్లబ్ లో బాలయ్య అఖండ మూవీ చేరింది.
ఇంతకుముందు బోయపాటి- బాలయ్య కాంబినేషన్ లో ఇప్పటికే సింహ, లెజెండ్ సినిమాలు భారీ విజయం సాధించడంతో అఖండపై భారీ అంచానాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే సినిమా భారీ హిట్ అయింది.
ఇదిలా ఉంటే మరోవైపు ఓటీటీలో కూడా బాలయ్య తన సత్తా చూపిస్తున్నారు. ఆహాలో వస్తున్న ‘ అన్ స్టాపబుల్’ భారీ హిట్ అయింది. ఈ షోలో బాలయ్య ఎనర్జీ అల్టిమేట్ గా ఉంది. తాను హోస్ట్ గా చేస్తున్న ఈ షోకు వ్యూస్ కూడా పెరిగాయి. ఇప్పటి వరకు మోహన్ బాబు, , బ్రహ్మ నందం, అనిల్ రావిపూడి, రవితేజ, రాజమౌళి, కీరవాణి, రానా సందడి చేశారు.
తాజాగా లైగర్ టీం.. బాలయ్య అన్ స్టాపబుల్ షోలో సండది చేసింది. జనవరి 14న ఈ షో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇప్పటికే ఈ షోకు సంబంధించిన ప్రోమో నెట్ లో హల్చల్ చేస్తోంది. బాలయ్య పంచెకట్టులో వావ్ అనిపించేలా ఉన్నారు. ఇదిలా ఉంటే బాలయ్య.. పైసా వసూల్ సినిమాలోని పాటతో ఎంట్రీ ఇచ్చారు. ఈ సందర్భంగా మాటల గన్ అంటూ దర్శకుడు పూరి జగన్నాథ్ ని పొగిడారు బాలకృష్ణ. వీళ్ల కాంబినేషన్లో వచ్చిన ‘పైసా వసూల్’ సినిమాలోని తేడా సింగ్ పాత్ర గురించి చర్చించుకున్నారు. ఈ సందర్భంగా బాలయ్య పూరీని లయన్ అని.. ఛార్మిని టైగర్ అని.. మీ ఇద్దరిద్దనీ కలిపితే.. ‘లైగర్’ అని చెప్పారు. ఇక ఆ తరువాత రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఎంట్రీ ఇచ్చాడు. బాలయ్య.. విజయ్ తో సరదాగా బాక్సింగ్ కూడా చేశారు.
మహిళల గౌరవం, భద్రతకు సంబంధించిన కేసుల్లో దేశ అత్యున్నత న్యాయస్థానం మరోసారి స్పష్టమైన సందేశం ఇచ్చింది. ఒక మహిళ లేదా…
సినిమా రంగంలో విజయవంతం కావాలంటే యువతను ఆకర్షించడం అత్యంత ముఖ్యమని చియాన్ విక్రమ్ నమ్ముతున్నారు. ఈ దృష్టిలో ఆయన భవిష్యత్…
తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న మహిళల ఉచిత బస్సు ప్రయాణ పథకం ‘మహాలక్ష్మి’లో కీలక మార్పులు చోటుచేసుకున్నాయి. ఇప్పటివరకు ఆధార్…
రష్మిక మందన్నా ప్రస్తుతం వ్యక్తిగత జీవితం, సినిమా కెరీర్ రెండింటినీ సమన్వయంగా నడిపే చిహ్నం అవుతున్నారు. ఈ నెల 26న…
ఇరవై ఏళ్ల క్రితం సినీ పరిశ్రమను కుదిపేసిన నటి ప్రత్యూష మృతి కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. ఈ కేసులో…
భారత్‌లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రంగం వేగంగా విస్తరిస్తున్న వేళ, Adani Group భారీ పెట్టుబడులతో ముందుకు రావాలని నిర్ణయించింది. 2035…