Kasturi Shankar: హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేసిన గృహలక్ష్మి ఫేమ్ కస్తూరి.. బాధపడు అంటూ ట్వీట్!
Kasturi Shankar: హీరో సిద్ధార్థ్ బ్యాడ్మింటన్ క్రీడాకారిణి సైనా నెహ్వాల్ పై చేసిన కామెంట్స్ ప్రస్తుతం తీవ్ర దుమారం రేపుతున్నాయి. ఈ క్రమంలోనే ఈ విషయం పై పలువురు స్పందిస్తూ సిద్ధార్థ్ పై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అయితే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ పంజాబ్ పర్యటనలో భాగంగా రాగా అతనిపై రైతులు దాడి చేయడంతో ఆ విషయంపై స్పందిస్తూ.. ప్రధానమంత్రికే రక్షణ లేకపోతే సామాన్య ప్రజలకు ఉంటుందా అంటూ ట్వీట్ చేశారు.
ఇలా సైనా నెహ్వాల్ చేసిన ట్వీట్ కి హీరో సిద్ధార్థ్ స్పందిస్తూ.. కాక్ చాంపియన్ అఫ్ ది వరల్డ్ అంటూ కామెంట్ చేయగా ఈ విషయంపై ఎంతోమంది స్పందిస్తూ తమదైన శైలిలో సిద్ధార్థ్ పై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికే ఇతని వ్యాఖ్యలపై జాతీయ మహిళ కమిషన్, సింగర్ చిన్మయి ఖండించారు. సిద్ధార్త్ ఇలా మాట్లాడడం అవమానకరమంటూ సింగర్ చిన్మయి ట్వీట్ చేశారు.
ఇదిలా ఉండగా తాజాగా ఈ విషయంపై గృహలక్ష్మి ఫేమ్ కస్తూరి శంకర్ స్పందిస్తూ తన దైన శైలిలో సిద్ధార్థ పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ట్వీట్ చేశారు. ఇప్పటివరకు సిద్ధార్థ్ రాజకీయంగా తన భావాలను వ్యక్త పరిస్తే అతని పై దాడి చేయడంతో అతనికి మద్దతుగా నిలిచాను. కానీ అతను ఈ విధంగా ఒక మహిళ పై వ్యక్తిగతంగా దాడి చేయడం ఏమాత్రం బాగాలేదని, ఇలా ఒక హీరో తన స్థాయి తగ్గించుకొని మాట్లాడటం సరికాదని, కాక్ అండ్ బుల్ స్టోరీ చెప్పి తప్పించుకోకుండా చేసిన తప్పుకు బాధపడు అంటూ ట్వీట్ చేశారు..
ఇలా కస్తూరి శంకర్ ట్వీట్ చేయడమే కాకుండా మరోసారి ట్వీట్ చేస్తూ.. నువ్వు ఇంకా ఈ ట్వీట్ ఎందుకు డిలీట్ చేయలేదు. నీ అడ్మిన్ మీద ఎందుకు ఆగ్రహం వ్యక్తం చేయలేదు. ఇంకా ఎందుకు సారీ చెప్పలేదు అంటూ మరో సారీ కస్తూరి శంకర్ హీరో సిద్ధార్థ్ వ్యాఖ్యలపై స్పందిస్తూ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…