Balakrishana: రిపోర్టర్ పై గాడిద అంటూ ఆగ్రహం వ్యక్తం చేసిన బాలయ్య.. ఏం జరిగిందంటే!
Balakrishana: టాలీవుడ్ ఇండస్ట్రీలో సీనియర్ నటుడిగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న వారిలో నందమూరి బాలకృష్ణ ఒకరు. ఈయన అంటే చాలామంది భయపడతారు.ఎందుకంటే బాలయ్య బాబుకి కోపం వస్తే ముందు ఎవరున్నారనే విషయాన్ని కూడా మర్చిపోయి వారికి గూబ పగిలి పోవాల్సిందే అనే విషయం కూడా మనకు తెలిసిందే.ఇలా ఎన్నో సార్లు బయటకు వచ్చినప్పుడు బాలకృష్ణ అభిమానుల పై చేయి చేసుకున్న సంఘటనలు ఎన్నో ఉన్నాయి.
ఈ క్రమంలోనే కొన్నిసార్లు ఎంతోమంది రిపోర్టర్లు తనని వివిధ రకాల ప్రశ్నలు వేస్తూ విసిగించినప్పుడు కూడా బాలకృష్ణ రిపోర్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేసిన సందర్భాలు చాలా ఉన్నాయని చెప్పవచ్చు.ఇదిలా ఉండగా తాజాగా మరోసారి బాలకృష్ణ రిపోర్టర్ల పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వారి పై తనదైన శైలిలో పంచ్ వేశారు.
నేడు స్వర్గీయ నందమూరి తారక రామారావు వర్ధంతి కావడంతో నందమూరి కుటుంబ సభ్యులు ఎన్టీఆర్ ఘాట్ కి వెళ్లి అతనికి నివాళులు అర్పించారు. ఈ క్రమంలోనే నందమూరి బాలకృష్ణ సైతం ఎన్టీఆర్ ఘాట్ కి చేరుకొని ఎన్టీఆర్ గారికి నివాళులు అర్పించిన అనంతరం మీడియాతో మాట్లాడారు.
ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతున్న బాలకృష్ణ ప్రస్తుతం కరోనా వేగంగా వ్యాప్తి చెందుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరు వ్యక్తిగత దూరం పాటించాలని చెబుతున్న సమయంలో వెంటనే రిపోర్టర్ కలుగజేసుకొని వ్యక్తిగత దూరం కాదు సామాజిక దూరం సార్ అంటూ సమాధానం చెప్పారు. రిపోర్టర్ ఇలా చెప్పేసరికి ఆగ్రహం వ్యక్తం చేస్తున్న బాలయ్య సామాజికం కాదు గాడిద వ్యక్తిగతం సామాజికం అంటే ఏమిటి అంటూ తన పై పంచ్ చేశాడు. ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో ఎంతో మంది నెటిజన్లు బాలయ్యబాబు మనసు ఎంతో ప్రశాంతంగా ఉన్నట్టు ఉంది లేదంటే రిపోర్టర్ చెంప చెల్లుమనేది అంటూ కామెంట్లు చేస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…