Movie News

Bandla Ganesh : ర్యాంప్ లు వ్యాంప్ లు వస్తుంటారు పోతుంటారు… ఎంతోమందిని స్టార్స్ ని చేసిన నీకు కొడుకు కోసం వచ్చే టైం లేదా..!

Bandla Ganesh : జార్జ్ రెడ్డి సినిమా దర్శకుడు జీవన్ రెడ్డి దర్శకత్వంలో వస్తున్న చిత్రం చోర్ బజార్. పూరి జగన్నాథ్ కొడుకు ఆకాష్ పూరి హీరోగా వస్తున్న ఈసినిమాలో హీరోయిన్ గహన సిప్పి నటిస్తోంది. ఈ నెల 24న విడుదలకు సిద్ధమైన ఈ సినిమా ప్రీ రిలీజ్ వేడుక ఘనంగా జరిగింది. ఈ వేడుకలో అందరికంటే హైలైట్ బండ్ల గణేష్ స్పీచ్. సాధారణంగా పవన్ కళ్యాణ్ గురించి బండ్ల గణేష్ స్పీచ్ అంటే అందరికి బాగా ఇంట్రస్ట్. ఇక పవన్ ఫ్యాన్స్ కి అయితే ఫుల్ జోష్ వస్తుంది. అలాంటి బండ్ల గణేష్ చోర్ బజార్ ప్రీ రిలీజ్ లో చేసిన కామెంట్స్ కూడా ఇపుడు బాగా వైరల్ అవుతున్నాయి.

వ్యాంపులు వస్తుంటారు పోతుంటారు… మనం బతికేది భార్య పిల్లలు కోసమే…

ఇక బండ్ల స్పీచ్ మొదలు పెట్టడమే పూరి జగన్నాథ్ భార్య లావణ్య తో మొదలుపెట్టాడు. లావణ్య గారిని వదిన అని పిలుస్తూ, సీతా దేవిని నిజంగా చూడలేదు కానీ లావణ్య వదినలో అంత సహనం ఉంది. ఒక భూమాతకున్న ఓపిక వదినకు సొంతం అంటూ మాట్లాడాడు. ఈ ఈవెంట్ కి వదిన కోసమే వచ్చాను. వదిన బ్రతుకుతున్నది పిల్లల కోసమే. ర్యాంపులు, వ్యాంపులు సినిమా జీవితంలో వస్తుంటారు పోతుంటారు, భార్య, పిల్లలే శాశ్వతం కొడుకు ఫంక్షన్ కి రాలేనంత బిజీగా ఉన్నావా పూరి అన్నా అంటూ మాట్లాడారు బండ్ల గణేష్.

ఎంతో మందిని మెగాస్టార్లు, సూపర్ స్టార్లను చేసావ్, నీ కొడుకు కోసం మాత్రం రాకుండా ముంబై లో ఉన్నావా. ఏదో ఒక రోజు ఆకాష్ పూరి పెద్ద హీరో అవుతాడు అప్పుడు ఆకాష్ డేట్ల కోసం నువ్వు ఎదురుచూడాలి అలాంటి రోజు వస్తుంది. అలాంటి రోజు వచ్చినపుడు నీకు డేట్లు ఇవ్వద్దని ఆకాష్ కి నేనే చెబుతాను అంటూ ఉద్వేగంగా మాట్లాడారు. ఇక కన్న బిడ్డలే శాశ్వతం మనం బ్రతికేది వాళ్ళ కోసమే, రేపు మనం చనిపోతే తల కొరివి పెట్టేది వాళ్లే, నా కొడుకు ఫంక్షన్స్ అయ్యుంటే లండన్ లో ఉన్నా ఎలాగోలా వచ్చేవాడిని కానీ నువ్వు నీ కొడుకు ఫంక్షన్స్ కి రావడానికి వీలుకాలేదా అంటూ పూరి పై మాటల అస్త్రాలను వదిలారు.

నీకు ఏమి లేనప్పుడే లావణ్య వదిన నిన్ను నమ్మి నీతో వచ్చింది పెళ్లి చేసుకుంది. నీకు స్టార్ డమ్ వచ్చాక నీ దగ్గరికి రాలేదు అంటూ పూరి పై ఘాటు వాఖ్యలు చేసాడు. స్టార్ హీరోలు వచ్చి నీ సినిమాకు ప్రచారం చేస్తారనుకున్న ఆకాష్ కానీ సినిమా వాళ్ళు కదా ఎవరురారు, ఎక్కడ నువ్వు పెద్ద హీరో అయితే వాళ్లకు పోటీ వస్తావో అని భయం అంటూ ఆకాష్ ను ఉద్దెశించి నువ్వు పెద్ద స్టార్ హీరో ఖచ్చితంగా అవుతావు అన్నారు. ఇక డైరెక్టర్ ను మేధావి అంటూ పొగిడారు. రెండు మూడు సార్లు మాట్లాడాను, ఆయన చాలా నాలెడ్జ్ ఉన్న వ్యక్తి, మాట్లాడాలంటే భయమేసింది అంటూ నవ్వారు. ఇక ఈ స్పీచ్ బాగా వైరల్ అవుతోంది. మరి బండ్ల అన్న కామెంట్స్ కి పూరి జగన్నాథ్ ఎలా స్పందిస్తారో చూడాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago