Bandla Ganesh: ఎన్నో ర్యాంప్ లు.. వ్యాంప్ వస్తుంటాయి... పూరి ఛార్మిలతో పాటు సెలబ్రెటీలను ఓ రేంజ్ లో ఆడుకున్న బండ్లన్న!
Bandla Ganesh: బండ్ల గణేష్ ఈ పేరు గురించి పరిచయం అవసరం లేదు. ఈయన సోషల్ మీడియా వేదికగా లేదా ఏదైనా వేదికపైకి మైక్ చేత పట్టారు అంటే సంచలన వ్యాఖ్యలు చేస్తూ ఉంటారు. ఈ క్రమంలోనే బండ్ల గణేష్ తాజాగా ఆకాష్ పూరి నటించిన చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఇక ఈ వేదికపై బండ్ల గణేష్ స్టార్ సెలబ్రిటీలకు తనదైన శైలిలో చురకలంటించారు.
ఈ సందర్భంగా ఆయన పూరి జగన్నాథ్ భార్య లావణ్య గురించి మాట్లాడుతూ తనపై ప్రశంసలు కురిపించారు. లావణ్య వదినకు సీతాదేవికి ఉన్నంత ఓపిక, సహనం ఉందని ఆమెపై ప్రశంసలు కురిపించడమేకాకుండా ఆమెకు పాదాభి వందనములు అంటూ తన గురించి ఎంతో గొప్పగా మాట్లాడారు.ఇక పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలతో ఇప్పుడు ఇండస్ట్రీలో ఎంతో మంది స్టార్ సెలబ్రెటీలు కొనసాగుతున్నారు. ఈ క్రమంలోనే ఆయన కుమారుడు కూడా ఇండస్ట్రీ లోకి ఎంట్రీ ఇచ్చారు.
ఇకపోతే చోర్ బజార్ సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు పూరి జగన్నాథ్ రాకపోవడంతో బండ్ల గణేష్ పెద్ద ఎత్తున తన పై ఆగ్రహం వ్యక్తం చేస్తూ పూరీ జగన్నాథ్ ను తనదైన శైలిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.ఈయనకు దేశమంతా కళ్లాపి చల్లే సమయం ఉన్న ఇంటి ముందు కల్లాపి చల్లే సమయం లేదు అనే సామెత చెబుతూ.. ఎంతోమందిని స్టార్ సెలబ్రిటీగా నిలబెట్టిన ఈయనకు తన కొడుకు సినిమా ఫంక్షన్ కు వచ్చే తీరిక లేకుండా పోయింది అంటూ పెద్ద ఎత్తున పూరి పై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అదే నా కొడుకు సినిమా ప్రీ రిలీజ్ వేడుకకు అయితే స్పెషల్ ఫ్లైట్ వేయించుకొని మరి వచ్చేవాణ్ణి. ఈయనకు మాత్రం తన కొడుకు సినిమా వేడుకకు రావడానికి తీరిక లేకుండా పోయింది అంటూ కామెంట్ చేశారు. జీవితంలో ఎన్నో ర్యాంప్ లు, వ్యాంప్ లు వస్తుంటాయి అంటూ కామెంట్ చేశారు. అయితే ఈ కామెంట్ సోషల్ మీడియాలో వైరల్ కావడంతో ఎంతో మంది చార్మిని ఉద్దేశించే బండ్ల గణేష్ ఇలాంటి వ్యాఖ్యలు చేశారని పెద్దఎత్తున కామెంట్లు చేస్తున్నారు. ఏది ఏమైనా బండ్లగణేష్ మరోసారి సినిమా వేడుకలో పరోక్షంగా పూరి జగన్నాథ్ చార్మిని ఉద్దేశిస్తూ ఎంతో ఆగ్రహం వ్యక్తం చేశారు
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…