Shrashti Maheswari : సెలబ్రిటీల పెళ్లిళ్లంటే కామన్ ఆడియన్స్ కి ఆసక్తి ఉంటుంది. సినిమా తారలైనా, బుల్లితెర తారలైనా ఈ సోషల్ మీడియా జమానా లో వారి పెళ్లిని మొదటి నుండి పెళ్లితంతు ముగిసే దాకా అభిమానులతో పంచుకుంటూ ఉంటారు. ఇక ఈమధ్యనే హీరోయిన్ నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ ల పెళ్లి ఘనంగా జరిగింది. ఇక చాలా మాది కరోనా పాండమిక్ తరువాత పెళ్లి పీఠలెక్కుతున్నారు. ఇపుడు మరో సీరియల్ నటి వివాహం చేసుకుంది.
పెళ్లి చేసుకున్న పాండ్యన్ స్టోర్ నటి శ్రీష్టి…
తమిళం లో పాండ్యన్ స్టోర్ సీరియల్ బాగా ఫేమస్. ఇక అదే సీరియల్ ను తెలుగులో వదినమ్మగా రీమేక్ చేసారు. ఇక ఇపుడు హిందీ లో కూడా పాండ్య స్టోర్ గా ఈ సీరియల్ స్టార్ ప్లస్ లో అలరిస్తోంది. ఈ సీరియల్ లో నటిస్తున్న శ్రీష్టి మహేశ్వరీ తాజాగా వివాహం చేసుకుంది. బెంగళూరు కి చెందిన సాఫ్ట్ వేర్ కరణ్ వైద్యా ను పెళ్లి చేసుకున్న మహేశ్వరీది పెద్దలు కుదుర్చిన వివాహం. జైపూర్ లో ఘనంగా వీరి వివాహం జరిగింది. ఇక ఫిబ్రవరి లోనే నిశితార్థం జరిగినా కరోనా వల్ల పెళ్లిని వాయిదా వేస్తూ వచ్చారు కాగా జూన్ 19 న జైపూర్ లో వివాహం చేసుకున్నారు.
ఇక తన పెళ్లి గురించి మాట్లాడుతూ కరణ్ చాలా రొమాంటిక్ అని అందుకే చాలా నచ్చుతాడని, ఇక తమ నిశితార్థం అయినప్పటి నుండి ఇప్పటివరకు ఏ మార్పు రాలేదని తమ వివాహాన్ని చాలా ఆనందంగా మర్చిపోలేని విధంగా చేసుకున్నట్లు తెలిపింది. కరణ్ అమెరికాలో ఉండటం వల్ల మంది కొన్ని రోజులు లాంగ్ డిస్టెన్స్ పెళ్లి అంటూ చెప్పింది. తాను త్వరలోనే షూటింగ్ లో పాల్గొంటున్నట్లు కొన్ని రోజులు తన విలువైన సమయాన్ని తన భర్తతో గడపనున్నట్లు శ్రీష్టి తెలిపారు. శ్రీష్టి కరణ్ ల పెళ్లి లో శ్రీష్టి ఎరుపురంగు లెహంగా వేసుకుంది, ఆ తరువాత వైట్ గౌన్ వేసుకుంది. ఇక దీని గురించి చెబుతూ ఇది మా డ్రీమ్ వెడ్డింగ్, ప్రతి విషయంలోనూ జాగ్రత్తగా ప్లాన్ చేసుకున్నాము. పాటలు పాడుతూ, డాన్సులు చేస్తూ నా పెళ్లిని చాలా ఆస్వాదించాను అంటూ చెప్పుకొచ్చింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…