Featured

Vijay : పోస్టర్ పై ఎందుకు తెలుగు అక్షరాలు లేవు… తెలుగు నిర్మాత, తెలుగు దర్శకుడి సినిమాలో తెలుగు పై ఇంత చిన్నచూపా…!

Vijay : భాషాభిమానం, దీని గురించి మనం ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంతమంచిది. ఎందుకంటే మనకు మన మాతృ భాషలో మాట్లాడటం కంటే పరాయి భాష వచ్చు అని చెప్పుకోవడమే నచ్చుతుంది కాబట్టి. ఎంతో మంది తెలుగు భాషాభిమానులు మాతృభాషను బ్రతికించండి అంటూ మొత్తుకున్నా మనకు మాత్రం అవసరం లేదు. పక్కనున్న తమిళులకు వారి భాష అంటే ఎంతో మక్కువ, జనాలకే కాదు సినిమా సెలబ్రిటిలైనా సరే వారి భాషకు ప్రాముఖ్యతని ఇస్తారు. కానీ మన వాళ్ళు మాత్రం ఆంగ్లం లో మాట్లాడటమే గొప్ప అనుకుని సంబరపడిపోతుంటారు.

విజయ్ సినిమా పోస్టర్ తెలుగులో ఎందుకు లేదు…

ఇక తాజాగా ఒక సినిమా పోస్టర్ లో తెలుగు అక్షరాలు మచ్చుకైనా కనిపించక పోవడం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. ప్రముఖ నిర్మాణ సంస్థలో దిల్ రాజు నిర్మిస్తున్న చిత్రం, వంశీ పైడిపల్లి దర్శకుడు, హీరో తమిళ హీరో విజయ్. కానీ సినిమా పేరు ప్రకటిస్తూ విడుదల చేసిన పోస్టర్ పై ఆంగ్ల అక్షరాలతో “Varasudu” అని రాసి ఉంది. కానీ ఎందుకు తెలుగులో అదే అక్షరాలను ‘వారసుడు’ అని రాయలేదో తెలియదు. పోస్టర్ ను సిద్ధం చేసే వాళ్ళల్లో తెలుగు తెలిసిన వాళ్ళు ఒక్కరు లేరా అని వ్యంగ్యంగా అనుకుంటున్నారు.

ఇక సినిమా విషయంలోనూ ఇదే గందరగోళం ఉంది. విజయ్ సోషల్ మీడియాలో పోస్టర్ షేర్ చేసారు. మూడు ఫోటోలను షేర్ చేస్తే మూడు తమిళ వెర్షన్ వే అవ్వడం విడ్డూరం. ఇక గతంలో ఇచ్చిన ఇంటర్వ్యూల్లో కూడా విజయ్ ఇది తమిళ సినిమా అని తెలుగులోకి అనువదిస్తామని చెప్పారు. కానీ దిల్ రాజు మాత్రం ఇది ద్విభాషా చిత్రం అంటూ ఆ మధ్య చెప్పారు. మరి ఈ సినిమా సంగతేంటో వాళ్లే క్లారిటీ ఇవ్వాలి. భవిష్యత్తులో అయినా తెలుగులో పోస్టర్ వదులుతారో లేదో చూడాలి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago