టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ నిర్మాతగా మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ పేరు ఈ మధ్య కాలంలో సోషల్ మీడియాలో ఎక్కువగా వినిపిస్తుంది. సోషల్ మీడియాలో ఎప్పుడూ యాక్టివ్ గా ఉండే బండ్లన్న తన పై వచ్చే రూమర్స్ కు ఎప్పటికప్పుడు స్పందిస్తూ వాటికి సరైన రీతిలో సమాధానం చెబుతున్నారు.ఈ క్రమంలోనే గత కొన్ని రోజుల నుంచి బండ్ల గణేష్ సినిమా ఎంట్రీ గురించి ఎన్నో వార్తలు సోషల్ మీడియాలో హల్ చల్ చేశాయి.
కోలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ యోగిబాబు ప్రధాన పాత్రలో నటించిన “మండేలా” చిత్రం ఎంతటి విజయాన్ని అందుకుందో అందరికీ తెలిసిందే.ఓటీటీలో విడుదలైన ఈ సినిమాపై తెలుగు నిర్మాతల కన్ను పడింది. ఎంతో మంచి విజయాన్ని అందుకున్న మండేలా చిత్రాన్ని తెలుగులో రీమేక్ చేయాలని మన తెలుగు నిర్మాతలు భావించినట్లు తెలుస్తోంది.అయితే తమిళంలో యోగి బాబు నటించిన ఈ పాత్రలో తెలుగులో హీరోగా బండ్ల గణేష్ సరిగ్గా సరిపోతారని, ఈ సినిమా ద్వారా బండ్ల గణేష్ హీరోగా రీఎంట్రీ ఇస్తున్నారని వార్తలు వినిపించాయి.
ఈ సినిమాలో బండ్ల గణేష్ నటించడం కోసం రీమేక్ హక్కులను కూడా కొనుగోలు చేసినట్లు గతంలో వార్తలు వినిపించాయి. తాజాగా ఈ సినిమాకు సంబంధించిన మరొక విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.మండేలా చిత్రంలో బండ్ల గణేష్ తప్పుకొని సునీల్ ఎంట్రీ ఇచ్చారనే వార్తలు రావడంతో ఈ విషయంపై బండ్లగణేష్ స్పందించారు. మండేలా చిత్రంలో నటించడం కోసం “ఒప్పుకుంటే కదా… తప్పు కునేది”అంటూ ట్వీట్ చేయడంతో ఈ సినిమాపై క్లారిటీ వచ్చింది. బండ్ల గణేష్ ఈ విధంగా ట్వీట్ చేయడంతో ఈ ట్వీట్ వైరల్ అయింది
భారతీయ సంప్రదాయ వైద్యంలో వేప చెట్టుకు ప్రత్యేక స్థానం ఉంది. తరతరాలుగా వేప ఆకులు, పువ్వులు, బెరడు, గింజలను అనేక…
దేశవ్యాప్తంగా ఇటీవల సిజేరియన్ ప్రసవాలకు సంబంధించిన కొన్ని ఘటనలు చర్చనీయాంశంగా మారాయి. రాజస్థాన్‌లోని కొన్ని ప్రభుత్వ ఆసుపత్రుల్లో ప్రసవం అనంతరం…
జూన్ నెలలో గ్రహాల సంచారాలు జ్యోతిష్య పరంగా ప్రత్యేక ప్రాధాన్యత సంతరించుకున్నాయి. ముఖ్యంగా జూన్ 17న చంద్రుడు కర్కాటక రాశిలోకి…
తమిళ సినీ దిగ్గజ దర్శకుడు భారతీరాజా మరణంతో ఆయన సినీ ప్రయాణానికి సంబంధించిన అనేక ఆసక్తికర అంశాలు మరోసారి వెలుగులోకి…
పుదుచ్చేరిలోని ఒక ప్రముఖ హోటల్‌లో జరిగిన సంఘటన వినియోగదారుల హక్కులపై మరోసారి చర్చకు దారి తీసింది. చికెన్ బిర్యానీ ఆర్డర్…
హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్ మరోసారి భారీ చర్చకు దారి తీస్తోంది. ఇటీవల రాయదుర్గంలో ప్రభుత్వ భూములకు ఎకరాకు రికార్డు…