ఎంతోమంది అతిథుల సమక్షంలో పెళ్ళి పీటల పై కూర్చుని కాసేపట్లో తాళి పట్టించుకోవాల్సిన వధువు తన బంధువులు వచ్చి తన చెవిలో ఒక విషయం చెప్పగానే ఉన్నపళంగా వధువు పెళ్లి పీటల పైనుంచి లేచి కౌంటింగ్ కేంద్రానికి పరుగులు పెట్టింది. ఈ విధంగా వధువు అక్కడినుంచి పారిపోవడంతో బంధువులందరూ ఎంతో షాక్ అయ్యారు. అయితే వధువుకు ఈ పెళ్లి ఇష్టం లేక అక్కడి నుంచి పారిపోలేదు. ఆ వధువు పారిపోవడానికి కారణం తెలుసుకున్న బంధువులు ఎంతో షాక్ అయ్యారు. అసలేం జరిగిందంటే..
ఉత్తరప్రదేశ్‌లోని రాంపూర్‌లోని మిలాక్ బ్లాక్‌లోని ముహమ్మద్‌పూర్‌లో చోటుచేసుకుంది. ఇటీవల ఈ ప్రాంతంలో పంచాయతీ ఎన్నికలు జరిగాయి. ఈ గ్రామంలోనే జదీద్ గ్రామానికి చెందిన పూనమ్ శర్మ కూడా 135 వార్డు నుంచి ఆమె ఎన్నికల బరిలో దిగారు. ఈ ఎన్నికలలో ఇద్దరికీ ఎంతో పోటాపోటీ ఉంది. అయితే ఎన్నికల ఫలితాలు వెలువడే రోజే పూనమ్ శర్మ పెళ్లి కూడా జరిగింది.
ఈ సందర్భంలోనే ఈ ఎన్నికల ఫలితాలు హోరాహోరీగా సాగుతున్నాయని తన బంధువులు పెళ్లి పీటలు పైనున్న పూనమ్ చెవిన వేయడంతో ఆమె పెళ్లి పీటల పైనుంచి లేచి హుటాహుటిన ఎన్నికల కౌంటింగ్ కేంద్రానికి పరుగులు పెట్టింది. ఎన్నికల లెక్కింపు పూర్తయ్యే సరికి ప్రత్యర్థి అభ్యర్థి పై 31 ఓట్ల తేడాతో గెలుపొందింది.
ఈ విధంగా 135 వ వార్డు నుంచి ఎన్నికైన సందర్భంగా ఆమె నియామక పత్రం అందుకొని ఎన్నికల కౌంటింగ్ కేంద్రం నుంచి పెద్ద ఎత్తున ఊరేగింపుగా కల్యాణమండపం చేరుకుని వరుడి చేత మూడు ముళ్ళు వేయించుకుంది.ఉన్నఫలంగా వధువు కౌంటింగ్ కేంద్రం నుంచి పరుగులు పెట్టడానికి కారణం తెలుసుకున్న కుటుంబ సభ్యులు ఎంతో ఆనందం వ్యక్తం చేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…