Movie News

Bandla Ganesh: బానిసత్వం అంటూ బ్లాస్ట్ చేసిన బండ్లన్న… ఎవరిని ఉద్దేశించి చేశారబ్బా?

Bandla Ganesh: సంచలనాలకు కేంద్ర బిందువుగా నిలిచే బండ్ల గణేష్ తెలుగు సినిమా ఇండస్ట్రీలో నిర్మాతగా ఎంతో మంచి పేరు సంపాదించుకున్నారు. అయితే ఈమధ్య కాలంలో బండ్ల గణేష్ ఎలాంటి సినిమాలను నిర్మించకపోయిన హీరోగా ప్రేక్షకుల ముందుకు వచ్చారు. అయితే ఈ సినిమా ఎప్పుడు వచ్చిందో కూడా ప్రేక్షకులకు తెలియదనే చెప్పాలి.

ఇకపోతే ఈయన సినిమాల పరంగా పక్కన పెడితే నిత్యం ఏదో ఒక వివాదాస్పద వ్యాఖ్యల ద్వారా తరచూ వార్తల్లో నిలుస్తుంటారు.ఈ క్రమంలోనే బండ్ల గణేష్ గత రెండు రోజుల క్రితం విజయ్ దేవరకొండ స్పీచ్ పై స్పందిస్తూ మరికొందరి హీరోలను పొగుడుతూ కామెంట్ చేశారు.అయితే ఆ హీరోల జాబితాలో పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ పేరులో ప్రస్తావించకపోవడంతో వీరి అభిమానులు బండ్ల గణేష్ పై తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ఇది మర్చిపోకముందే మరోసారి బండ్ల గణేష్ ట్విట్టర్ వేదికగా బానిసత్వానికి ఓ హద్దు ఉంటుంది అంటూ సంచలనమైన ట్వీట్ చేశారు. ఇక ఈ ట్వీట్ చేయడమే కాకుండా ఒక ఫోటో వీడియోని కూడా పంచుకున్నారు. ఇక బండ్ల గణేష్ షేర్ చేసిన ఫోటో గాడిద ఫోటో కావడం గమనార్హం. ఇలా బండ్ల గణేష్ బానిసత్వం హద్దు అంటూ చేసిన ఈ ట్వీట్ వైరల్ అయింది.

ఆసక్తికరంగా మారిన ఫోటో…

ఈ క్రమంలోనే నేటిజన్స్ ఈట్వీట్ చూసిన అనంతరం బండ్ల గణేష్ ఎవరిని ఉద్దేశించి ఇలాంటి ట్వీట్ చేశారు అంటూ ఆరాతీస్తున్నారు. ఈ క్రమంలోనే కొందరు కచ్చితంగా పవన్ కళ్యాణ్, మెగా కుటుంబాన్ని ఉద్దేశించి ఈ ట్వీట్ చేశారని భావిస్తున్నారు.ఇన్ని రోజులపాటు తాను పవన్ కళ్యాణ్ కు మెగా కుటుంబానికి బానిసగా పని చేశానని అయితే తన బానిసత్వానికి కూడా ఓ హద్దు ఉంటుందన్న ఉద్దేశంతోనే ఈయన ఈ ట్వీట్ చేశారని భావిస్తున్నారు.ఇకపోతే ఈయన గాడిది ఫోటో షేర్ చేయడం కూడా ఆసక్తికరంగా మారింది. ఈయన ఉద్దేశంలో ఆ గాడిద ఎవరు? ఎవరిని ఉద్దేశించి ఇలాంటి ఫోటో షేర్ చేశారని నేటిజన్స్ భావిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago