Movie News

Jr.NTR: అభిమానులను ఆందోళనకు గురి చేస్తున్న ఎన్టీఆర్ న్యూ లుక్.. మళ్ళీ లావైపోయాడా? ఇలా తయారయ్యారేంటి ?

Jr.NTR:జూనియర్ ఎన్టీఆర్ ఇండస్ట్రీలోకి వచ్చిన మొదట్లో ఎంతో స్లిమ్ గా అందంగా ఉన్నప్పటికీ అనంతరం ఈయన తన శరీర బరువు పెరగడంతో బొద్దుగా తయారయ్యారు. ఈ క్రమంలోనే సింహాద్రి, రాఖీ, నా అల్లుడు వంటి సినిమాలలో ఎన్టీఆర్ చాలా శరీర బరువు పెరిగిపోయారు.అయితే యమదొంగ కంత్రీ వంటి సినిమాలలో పూర్తిగా స్లిమ్ అయిన ఎన్టీఆర్ బృందావనం అరవింద సమేత వంటి సినిమాలలో ఎంతో అందంగా కనిపించారు.

ఈ విధంగా ఎన్టీఆర్ అరవింద సమేత సినిమా వరకు తన స్లిమ్ మెయింటైన్ చేసినప్పటికీ రాజమౌళి దర్శకత్వంలో వచ్చిన RRR సినిమాలో ఎన్టీఆర్ తన పాత్ర కోసం కాస్త బొద్దుగా తయారయ్యారు.ఇలా ఈ సినిమా కోసం లావైనా ఎన్టీఆర్ తదుపరి కొరటాల శివ సినిమా కోసం పూర్తిగా సన్నబడతారని ఈయన లుక్ కోసమే ఈ సినిమా వాయిదా పడుతూ వస్తోందంటూ వార్తలు వినిపించాయి.

అయితే ఈ సినిమాకు సంబంధించి అఫీషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చినదే మొదలు అప్పటినుంచి ఈ సినిమాకు సంబంధించి ఎలాంటి అప్డేట్ రాలేదు. మరోవైపు కొరటాల ఎన్టీఆర్ ను సన్నబడాలని కండిషన్ పెట్టడంతో ఎన్టీఆర్ తన లుక్ మార్చుకోవడం కోసం కష్టపడుతున్నారని అందరూ భావించారు.అయితే తాజాగా ఎన్టీఆర్ కి సంబంధించిన ఓ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. ఈ ఫోటోని చూసిన అభిమానులు ఒక్కసారిగా ఆందోళన వ్యక్తం చేశారు.

Jr.NTR:ఎన్టీఆర్ లుక్ చూసి ఆందోళనలో అభిమానులు…

ఎన్టీఆర్ అధికంగా శరీర బరువు పెరిగిపోవడమే కాకుండా గుబురు జుట్టుతో అచ్చం 10 సంవత్సరాల క్రితం ఎన్టీఆర్ ను తలపిస్తోంది. ఈ ఫోటో చూసిన అభిమానులు ఒక్కసారిగా షాక్ అయ్యారు. ఎన్టీఆర్ ఏంటి ఇలా తయారయ్యారు కొరటాల శివ సినిమాలో ఇలాగే కనిపించనున్నారా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఈ క్రమంలోనే కొందరు ఈ ఫోటోపై స్పందిస్తూ ఇది ప్రస్తుతం ఫోటో అయి ఉండదు అంటూ కామెంట్లు చేస్తున్నప్పటికీ మరికొందరు మాత్రం ఎన్టీఆర్ లుక్ గురించి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.అయితే ఈయన ప్రజెంట్ లుక్ ఎలా ఉందో తెలియాలంటే బింబిసార సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ వరకు మనం వేచి చూడాలి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago