Movie News

Vijay Devarakonda: ప్రేమ గురించి చెప్పి వారి గుండె ముక్కలు చేయలేను… ప్రేమ పెళ్లి అంటూ షాకింగ్ కామెంట్స్ చేసిన రౌడీ హీరో?

Vijay Devarakonda: రౌడీ హీరో విజయ్ దేవరకొండకు ఎలాంటి క్రేజ్ ఉందో చెప్పాల్సిన పనిలేదు. ఈయన ఇప్పటివరకు తెలుగులో ఎన్నో అద్భుతమైన సినిమాలలో నటించి మంచి ఆదరణ పొందారు. అయితే మొదటిసారిగా పూరి జగన్నాథ్ దర్శకత్వంలో తెరకెక్కిన లైగర్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల కాబోతోంది. ఇక ఈ సినిమా వచ్చే నెల 25వ తేదీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.

ఈ సినిమా విడుదల కాకుండానే విజయ్ దేవరకొండకు బాలీవుడ్ ఇండస్ట్రీలో కూడా విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఏర్పడింది. ఎంతగా అంటే ఏకంగా బాలీవుడ్ స్టార్ హీరోయిన్లు సైతం తనతో డేటింగ్ కు వెళ్లాలి అనేలా ఈయనకు క్రేజ్ ఏర్పడిందని చెప్పాలి. లైగర్ సినిమా ఆగస్ట్ 25వ తేదీ విడుదల కావడంతో ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా విజయ్ అనన్య పాండే ఇద్దరు కాఫీ విత్ కరణ్ టాక్ షోలో పాల్గొన్నారు.

Vijay Devarakonda: విజయ్ దేవరకొండ న్యూడ్ ఫోటో రిలీజ్ వెనుక కారణం అదేనా?

ఈ కార్యక్రమంలో భాగంగా విజయ్ దేవరకొండ ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు. ఇకపోతే ఈయన ప్రేమ పెళ్లి గురించి కూడా ఈ సందర్భంగా చేసిన కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి. తాను పెళ్లి పిల్లల గురించి ఇప్పుడే మాట్లాడదల్చుకోలేదని ఆ సమయం వచ్చినప్పుడు తానే గట్టిగా సమాధానం చెబుతానని వెల్లడించారు.

ఇంట్లో నా పోస్టర్స్ పెట్టుకున్నారు…

ప్రస్తుతం ఎంతోమంది అభిమానులు తనని ప్రేమిస్తున్నారని గౌరవిస్తున్నారని ఆ గౌరవంతోనే తన ఫోటోలను తమ ఫోన్ స్క్రీన్ పై పెట్టుకోవడం, ఇంట్లో పోస్టర్స్ పెట్టుకోవడం చేస్తున్నారు అంటూ విజయ్ వెల్లడించారు. ఇప్పుడు నేను ప్రేమ పెళ్లి గురించి మాట్లాడి వారిని బాధ పెట్టలేను, గుండెను ముక్కలు చేయలేను అంటూ ఈ సందర్భంగా విజయ్ దేవరకొండ ప్రేమ గురించి షాకింగ్ కామెంట్స్ చేశారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago