Bandla Ganesh: బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు.ఒకప్పుడు సినిమాలలో కమెడియన్ గా ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ అనంతరం నిర్మాతగా మారి బ్లాక్ బస్టర్ సినిమాలను నిర్మించారు. ఇలా నిర్మాతగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరంగా ఉన్నప్పటికీ ఇండస్ట్రీలో జరిగే అన్ని విషయాలపై స్పందిస్తూ ఉంటారు.
ఇలా బండ్ల గణేష్ ప్రతి ఒక్క విషయం గురించి తన అభిప్రాయాన్ని తెలియజేస్తూ పెద్ద ఎత్తున వార్తల్లో నిలుస్తుంటారు. ఇకపోతే పవన్ కళ్యాణ్ కి ఈయన పెద్ద భక్తుడు అనే విషయం మనకు తెలిసిందే.పవన్ కళ్యాణ్ గురించి ఎవరైనా ఒక చిన్నమాట అన్న టక్కున ఆ విషయంపై స్పందిస్తూ వారికి తన స్టైల్ లో సమాధానం చెబుతారు.
ఈ క్రమంలోనే తాజాగా బాలకృష్ణ పవన్ కళ్యాణ్ ఇద్దరు ఒకచోట కలిసినటువంటి ఫోటో సోషల్ మీడియాలో వైరల్ అయింది. అయితే ఈ ఫోటో గురించి పెద్ద ఎత్తున కథనాలు వెళ్లబడ్డాయి.పవన్ కళ్యాణ్ త్వరలోనే అన్ స్టాపబుల్ కార్యక్రమానికి రాబోతున్నారు అంటూ కొన్ని వెబ్సైట్స్ కథనాలు రాయగా, మరికొన్ని మాత్రం బాలకృష్ణ పవన్ సినిమా షూటింగ్స్ పక్కపక్కనే జరగడంతో ఇద్దరు కలిసారనీ చెప్పుకొచ్చారు.
ఇకపోతే త్వరలోనే బాలకృష్ణ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్నటువంటి అన్ స్టాపబుల్ కార్యక్రమానికి పవన్ కళ్యాణ్ హాజరుకానున్నారని అయితే ఈ కార్యక్రమంలో భాగంగా తన మూడు పెళ్లిళ్లు తన భార్యల గురించి ప్రస్తావనకు తీసుకురావద్దని బాలకృష్ణకు పవన్ కళ్యాణ్ రిక్వెస్ట్ చేసినట్టు ఓ వెబ్ సైట్ లో వార్తలు రాశారు.
ఈ క్రమంలోనే ఈ వార్తపై బండ్ల గణేష్ స్పందిస్తూ… మీ భార్య గురించి వాళ్ళు ఎందుకు ప్రస్తావనకు తీసుకు వస్తారు. వెంకీ నువ్వు అన్నా చెప్పు లేదా దేవీ ప్రియ..! అంటూ క్వశ్చన్ చేశారు బండ్ల గణేష్. అయితే పవన్ కళ్యాణ్ గురించి ఈ విధమైనటువంటి ట్వీట్ చేసిన కొంత సమయానికే ఆ ట్వీట్ డిలీట్ చేయడంతో అసలు బండ్ల గణేష్ ఎందుకు ట్వీట్ చేశారు. ఎందుకు డిలీట్ చేశారనే విషయంపై చర్చలు జరుగుతున్నాయి
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…