Singer Chinmayi: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో లేడీస్ సూపర్ స్టార్ గా ఎంతో మంచి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న నయనతార ప్రస్తుతం వరుస సినిమాలతో ఎంతో బిజీగా ఉన్నారు. తాజాగా తన భర్త విగ్నేష్ నిర్మాణంలో నయనతార నటించిన కనెక్ట్ సినిమా విడుదల సందర్భంగా ఈమె పెద్ద ఎత్తున సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో పాల్గొన్నారు.
ఇక ఈ సినిమా డిసెంబర్ 22వ తేదీ విడుదలైంది.ఈ సినిమా విడుదలకు ముందు ప్రీమియర్ షో చూడడం కోసం నయనతార తన భర్తతో కలిసి బయటకు వచ్చారు. ఈ క్రమంలోనే ఇందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి.ఈ ఫోటోలు చూసినటువంటి నైటిజన్స్ నయనతారపై పెద్ద ఎత్తున బాడీ షేమింగ్ ట్రోల్స్ చేశారు.
నయనతార ఇద్దరు పిల్లలకు తల్లి అయిన ఏమాత్రం తనలో మార్పులు లేవంటూ కామెంట్లు చేశారు.ఈ కామెంట్లపై తాజాగా సింగర్ చిన్మయి శ్రీపాద తీవ్రస్థాయిలో మండిపడుతూ నెటిజన్లకు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు.ఈ సందర్భంగా చిన్మయి మాట్లాడుతూ ఇంట్లో తండ్రి లేదా సోదరుడు ఉన్నప్పుడు ఒక తల్లి తన కుమార్తెకు చున్ని వేసుకోమని సలహా ఇవ్వాల్సి వస్తుందేమో అని ఆశ్చర్యపోయారు.
ఎందుకంటే ఇంట్లో కూతురిని, సోదరిని చూసినప్పటికీ పురుషుల తమ కోరికలను కంట్రోల్ చేసుకోలేకపోతున్నారు. నయనతార గురించి వల్గర్ కామెంట్స్ చేసిన వాళ్ళని చూస్తే అసలు తల్లి పాలు తాగి పెరిగార అన్న ఆశ్చర్యం కలుగుతుంది అంటూ ఈమె నయనతార పై వచ్చినటువంటి బాడీ షేమింగ్ పై స్పందిస్తూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. ప్రస్తుతం చిన్మయి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…