Bandla Ganesh: టాలీవుడ్ ఇండస్ట్రీలో కమెడియన్ ఎంతో మంచి పేరు సంపాదించుకున్న బండ్ల గణేష్ అనంతరం నిర్మాతగా పలు సినిమాలను నిర్మించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా ఇండస్ట్రీలో నిర్మాతగా నటుడిగా ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న బండ్ల గణేష్ ఈ మధ్యకాలంలో సినిమాలకు దూరంగా ఉన్నప్పటికీ ఈయన ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్క విషయంపై స్పందిస్తూ తనదైన శైలిలో కామెంట్లు చేస్తుంటారు.
ఈ క్రమంలోనే తాజాగా ఒక యూట్యూబ్ ఛానల్ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి బండ్ల గణేష్ ఎన్నో విషయాలను వెల్లడించడమే కాకుండా తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు.గతంలో బండ్ల గణేష్ త్వరలోనే న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తానంటూ తెలియజేసిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూలో న్యూస్ ఛానల్ గురించి ప్రశ్నలు ఎదురవడంతో బండ్ల గణేష్ ఇంతెత్తున ఫైర్ అయ్యారు.
త్వరలోనే న్యూస్ ఛానల్ ఏర్పాటు చేస్తామన్నారు కదా అంటూ యాంకర్ ప్రశ్నించగా డబ్బులు వచ్చే చోట, లాభాలు వచ్చే చోట వ్యాపారం చేయాలని ఆలోచించడంలో తప్పులేదు కదా అంటూ బండ్ల గణేష్ సమాధానం చెప్పారు.అయితే బాగా లాభాలు వస్తున్నాయని మీరు అనుకుంటున్నారా అంటూ యాంకర్ ప్రశ్నించగా మరి మీరంతా అడుక్కుతింటున్నారా అంటూ బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు. మీకు చాలా కోపం వస్తున్నట్టుంది అంటూ మరోసారి యాంకర్ మాట్లాడటంతో కోపం రాదా.. కోపం ఇంతే రావాలని ఎక్కడైనా రాసుందా అంటూ తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
ఇక ఈ ఇంటర్వ్యూలో భాగంగా గతంలో త్రివిక్రమ్ శ్రీనివాస్ గురించి బండ్ల గణేష్ చేసిన కామెంట్స్ పై కూడా ఈయన నోరు విప్పారు.గతంలో ఓ సినిమా ఫ్రీ రిలీజ్ ఈవెంట్ కార్యక్రమంలో భాగంగా త్రివిక్రమ్ శ్రీనివాస్ నుతిడుతూ ఒక ఆడియో లీక్ అయింది. అయితే గతంలో ఆ వాయిస్ నాది కాదన్న బండ్ల గణేష్ తాజాగా ఇంటర్వ్యూ సందర్భంగా ఆ వాయిస్ నాదే నేనే త్రివిక్రమ్ శ్రీనివాస్ ను తిట్టాను అంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.మొత్తానికి ఆ వీడియో పై స్పందించి బండ్ల గణేష్ నిజం ఒప్పుకున్నారు. ఈ క్రమంలోనే ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈయన చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…