AdiPurush: ప్రభాస్ అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నటువంటి సమయం రానే వచ్చింది. ప్రభాస్ బాలీవుడ్ దర్శకుడు ఓం రౌత్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆది పురుష్ సినిమా నుంచి బిగ్ అప్డేట్ విడుదల చేశారు.ఈ సినిమా నుంచి ప్రభాస్ కి సంబంధించిన ఫస్ట్ లుక్ విడుదల కాగా తాజాగా అయోధ్యలో సరియు నది తీరాన ఈ సినిమా టీజర్ విడుదల చేశారు . ఇక ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.
ఇకపోతే ఈ టీజర్ పై కొందర అభిమానులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నట్టు తెలుస్తోంది.ఈ టీజర్ కన్నా కార్టూన్ ఛానల్ ఎంతో అద్భుతంగా ఉంటుందని కొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ టీజర్ విషయానికి వస్తే సీత, రాముడి పాత్రతో పాటు హనుమంతుడి పాత్ర కూడా ఎంతో కీలకంగా ఉంది. ఈ క్రమంలోనే ఈ సినిమాలో హనుమంతుడు పాత్రలో నటించిన నటుడు ఎవరు అనే విషయంపై పెద్ద ఎత్తున చర్చలు జరుగుతున్నాయి.
ఈ సినిమాలో హనుమంతుడి పాత్రలో నటించిన వ్యక్తి పేరు దేవదత్త గజానన్ నాగే అని తెలుస్తుంది. ఈయన పలు సీరియల్స్ సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. జై మల్హర్ అనే సీరియల్ లార్డ్ ఖండోబా పాత్రలో నటించి ఎంతో పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్నటువంటి ఈయన వీర్ శివాజీ, దేవయాని, బాజీరావ్ మస్తానీ వంటి సినిమాలలో కూడా కీలక పాత్రలలో నటించారు.
ఇలా పలు సినిమాలు సీరియల్స్ ద్వారా ఎంతో మంచి గుర్తింపు పొందిన దేవదత్త ప్రస్తుతం ఆది పురుష్ సినిమాలో హనుమంతుడి పాత్ర ద్వారా ప్రేక్షకుల ముందుకు రానున్నారు. ఇకపోతే ఈయన 17 సంవత్సరాల వయసులోనే వ్యాయామశాలని ఏర్పాటు చేశారు.ఆ వ్యాయామసాలకు హనుమాన్ వ్యాయామశాల అని పేరు పెట్టారు. హనుమంతుడు అంటే ఎంతో భక్తి భావం కలిగినటువంటి ఈయనకు ఇలా హనుమంతుడి పాత్రలో నటించే అవకాశం రావడం చాలా సంతోషంగా ఉందని పేర్కొన్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…