Bandla Ganesh: బండ్ల గణేష్ పరిచయం అవసరం లేని పేరు నటుడిగా నిర్మాతగా ఇండస్ట్రీలో ఎంతోమంది గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు వీరాభిమాని అనే విషయం మనకు తెలిసిందే. ఈయన ఏ కార్యక్రమానికి వెళ్లిన సోషల్ మీడియా వేదికగా ఏ పోస్ట్ చేసిన తన అభిమాన నటుడు తన ఆరాధ్య దైవం పవన్ కళ్యాణ్ గురించి ఎంతో గొప్పగా చెబుతుంటారు.
ఈశ్వర పవనేశ్వర అంటూ పవన్ కళ్యాణ్ ను దైవ సమానంగా భావించే బండ్ల గణేష్ గురు పౌర్ణమి సందర్భంగా సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ గురించి చేసిన పోస్ట్ ప్రస్తుతం వైరల్ అవుతుంది. ఈ సందర్భంగా ఈయన ట్విట్టర్ వేదికగా స్పందిస్తూ గురు పౌర్ణమి సందర్భంగా గురువుగారికి శుభాకాంక్షలు అని తెలియజేశారు.
మీరు ఎల్లప్పుడూ మీ కృషితో అనుకున్న స్థాయిని చేరుకోవాలి మీ స్థానం స్థాయి తెలిసినవాడిగా చెబుతున్నాను. నా సహాయం ఏదైనా ఉంటే తప్పకుండా చేస్తాను కానీ మీ పేరును వాడుకొని నేను లాభం పొందను.నా ఆశయం ఒక్కటే మీరు మీ మంచి మనసులాగా మీరు అనుకున్నది నెరవేరాలని పది కాలాలపాటు ఆయురారోగ్యాలతో సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను అంటూ ఈయన ట్వీట్ చేస్తూ పవన్ కళ్యాణ్ కు ట్యాగ్ చేశారు. ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్ గా మారడంతో బండ్ల గణేష్ కు పవన్ కళ్యాణ్ పై ఎంతటి అభిమానం ఉందో అర్థమవుతుంది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…