Hansika: బాలనటిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టి అనంతరం హీరోయిన్ గా సుమారు 50 సినిమాలలో నటించి నటిగా ఎంతో మంచి సక్సెస్ అందుకున్నటువంటి హన్సిక ప్రస్తుతం వైవాహిక జీవితంలోకి అడుగు పెట్టారు. ఇలా ఈమె వైవాహిక జీవితంలోకి అడుగుపెట్టిన కూడా వరుస సినిమా అవకాశాలను అందుకుంటూ ఎంతో బిజీగా ఉన్నారు. ఈ క్రమంలోనే తమిళంలో ఈమె ఆది పినిశెట్టితో కలిసి పార్టనర్ అనే సినిమాలలో చేశారు.
ఈ సినిమా త్వరలోనే విడుదల కానున్న నేపథ్యంలో ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ట్రైలర్ లాంచ్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అనంతరం చిత్ర బృందం మొత్తం ప్రెస్ మీట్ కార్యక్రమంలో పాల్గొన్నారు.ఈ ప్రెస్ మీట్ కార్యక్రమంలో భాగంగా నటుడు రోబో శంకర్ హన్సిక గురించి సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఈ కార్యక్రమంలో భాగంగా హన్సిక వేదికపై ఉన్నప్పటికీ రోబో శంకర్ మాట్లాడుతూ ఈ సినిమాలో సన్నివేశంలో హన్సిక నా కాలు తాకాల్సి ఉంది కానీ డైరెక్టర్ చెప్పిన ఈమె నా కాలు తాకలేదని కనీసం నన్ను ముట్టుకోవడానికి కూడా ఇష్టపడటం లేదు అంటూ కామెంట్ చేశారు.ఈ విధంగా ఈమె వ్యవహార శైలికి నాతో పాటు అక్కడ ఉన్నటువంటి వారందరూ ఆశ్చర్యపోయారని తెలిపారు.
ఈ విధంగా హన్సిక గురించి పబ్లిక్ గా ఆమె ముందే రోబో శంకర్ చేసినటువంటి ఈ కామెంట్స్ వైరల్ గా మారడంతో ఇది కాస్త వివాదంగా మారింది. ఈ క్రమంలోనే ఈయన మాటలకు లేడీ జర్నలిస్టు తీవ్ర స్థాయిలో అసహనం వ్యక్తం చేశారు. అయితే ఈయన చేసిన ఈ వ్యాఖ్యలపై తన కుటుంబం స్పందిస్తూ ఈయన గత కొంతకాలంగా అనారోగ్య సమస్యతో బాధపడుతున్నారని జాండీస్ కూడా వచ్చాయని దీంతో మానసిక స్థితి కోల్పోతున్నారు అంటూ చెప్పుకొచ్చారని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…