పిల్లలు ఇష్టపడే క్రీమ్ బిస్కెట్లు ఆరోగ్యకరమని అనుకునే తల్లిదండ్రులకు తాజా సమాచారం ఆలోచన కలిగిస్తోంది. ప్యాకెట్లపై కనిపించే ‘క్రీమ్’ పదం వెనుక అసలు విషయం వేరేలా ఉందని నిపుణులు చెబుతున్నారు. నిజమైన పాల క్రీమ్‌తో తయారైతేనే ‘Cream’ అని పేర్కొనాలి. అయితే మార్కెట్లో చాలా ఉత్పత్తులపై ‘Crème’ అనే పదాన్ని ఉపయోగిస్తూ, పాలతో సంబంధం లేకుండా తయారైన మిశ్రమాలను విక్రయిస్తున్నట్టు వెల్లడైంది.
ఈ ‘Crème’ ఫిల్లింగ్‌లో ప్రధానంగా పామాయిల్, వెజిటబుల్ ఫ్యాట్స్, అధిక చక్కెర, కృత్రిమ రంగులు, ఫ్లేవర్లు ఉంటాయని సమాచారం. రుచికి క్రీమ్‌లా అనిపించినా, పోషక విలువలు తక్కువగా ఉండటమే కాకుండా ఆరోగ్యానికి హానికరమయ్యే అవకాశముందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ముఖ్యంగా చిన్నారుల్లో ఊబకాయం, షుగర్, గుండె సమస్యలు పెరగడానికి ఇవి కారణమవుతాయని సూచిస్తున్నారు.
కనిపించే ఆకర్షణీయ ప్యాకేజింగ్‌కి మోసపోకుండా, కొనుగోలు చేసే ముందు పదార్థాల జాబితాను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. పామాయిల్, చక్కెర వంటి పదార్థాలు ఎక్కువగా ఉంటే అలాంటి బిస్కెట్ల వినియోగాన్ని తగ్గించడం మంచిదని చెబుతున్నారు. పిల్లల ఆరోగ్యం దృష్టిలో ఉంచుకుని తల్లిదండ్రులు జాగ్రత్తగా ఎంపిక చేసుకోవడం అవసరం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…