ధనియాల మొక్కలే ఈ కొత్తిమీర. మంచి సువావన కలిగి ఉంటుంది. వంటకాలలో విరివిగా వాడతారు. మన తెలుగు వారు దాదాపు ప్రతి కూరలో దీనిని వేస్తారు. ‘కొత్తిమీర’ సాధారణంగా రుచికోసం వంటకాల్లో వాడుతుంటాం. అయితే ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు స్కిన్ స్పెషలిస్ట్ లు. కొత్తిమీర ఆకుల్లో ఫోలేట్, విటమిన్ – సి, ఐరన్, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి.
అవి చర్మానికి అందం పెంచడంలో సహాయపదతాయని చెబుతున్నారు. రెండు చెంచాల కొత్తిమీర ముద్దకు పావు చెంచా పాలు, తేనే, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆలా రాసిన కాసేపటికి అది ఆరిన తరువాత నీటితో ముఖం కడిగితే చర్మానికి గ్లో వస్తుందని వస్తుందని చెబుతున్నారు స్కిన్ స్పెషలిస్ట్ లు.
అంతేకాదు కొత్తిమీర ఆకులు వయస్సు మీద పడుతున్నప్పుడు వచ్చే ముడతలను సైతం నివారిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేసి పిగ్మెంటేషన్, రింకిల్స్, లూజ్ స్కిన్ వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి. కొత్తిమీర ఆకులులో అలోవెరా జెల్ కలిపి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయండి. ఇలా రోజూ చేయడం వాళ్ళ మంచి ఫలితం ఉంటుంది.
ప్రకృతిలో జరిగే కొన్ని ఖగోళ అద్భుతాలు మన కళ్లకు నేరుగా కనిపించకపోయినా వాటి ప్రభావాన్ని మాత్రం మనం స్పష్టంగా అనుభవిస్తాం.…
చిన్న వయసులో ఆరోగ్యం గురించి పెద్దగా ఆలోచించని వారు చాలా మంది ఉంటారు. "ఇప్పుడేం కాదు.. తర్వాత చూసుకుందాం", "ఇంకా…
ఈ రోజుల్లో డబ్బు లేకుండా ఏ పని జరగని పరిస్థితి. ఉదయం ఇంటి నుంచి బయటకు అడుగు పెట్టిన దగ్గర…
మన తెలుగు వంటింట్లో కరివేపాకుకు ప్రత్యేక స్థానం ఉంది. పప్పు నుంచి పులుసు వరకు, చట్నీ నుంచి ఫ్రై వరకు…
హైదరాబాద్, జూన్ 20: నిర్మొహమాటంగా నికార్సుగా చెప్పాల్సి వస్తే తెలుగు రాష్ట్రాల్లో నిస్వార్ధ సేవకు నిలువెత్తు అక్షరంగా ప్రతిభతో, ప్రజ్ఞతో,…
వంట చేయడం ఒక కళ. అందులో రుచి రావాలంటే ఉప్పు, కారం, మసాలాలు అన్నీ సరైన మోతాదులో ఉండాలి. అయితే…