ధనియాల మొక్కలే ఈ కొత్తిమీర. మంచి సువావన కలిగి ఉంటుంది. వంటకాలలో విరివిగా వాడతారు. మన తెలుగు వారు దాదాపు ప్రతి కూరలో దీనిని వేస్తారు. ‘కొత్తిమీర’ సాధారణంగా రుచికోసం వంటకాల్లో వాడుతుంటాం. అయితే ఇది చర్మ ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుందని చెబుతున్నారు స్కిన్ స్పెషలిస్ట్ లు. కొత్తిమీర ఆకుల్లో ఫోలేట్, విటమిన్ – సి, ఐరన్, బీటా కెరోటిన్, యాంటీఆక్సిడెంట్లు సమృద్దిగా ఉంటాయి.

అవి చర్మానికి అందం పెంచడంలో సహాయపదతాయని చెబుతున్నారు. రెండు చెంచాల కొత్తిమీర ముద్దకు పావు చెంచా పాలు, తేనే, నిమ్మరసం కలిపి ముఖానికి రాసుకోవాలి. ఆలా రాసిన కాసేపటికి అది ఆరిన తరువాత నీటితో ముఖం కడిగితే చర్మానికి గ్లో వస్తుందని వస్తుందని చెబుతున్నారు స్కిన్ స్పెషలిస్ట్ లు.

అంతేకాదు కొత్తిమీర ఆకులు వయస్సు మీద పడుతున్నప్పుడు వచ్చే ముడతలను సైతం నివారిస్తాయి. ఇవి ఫ్రీ రాడికల్స్ తో ఫైట్ చేసి పిగ్మెంటేషన్, రింకిల్స్, లూజ్ స్కిన్ వంటి అనేక చర్మ సంబంధిత సమస్యలు రాకుండా కాపాడతాయి. కొత్తిమీర ఆకులులో అలోవెరా జెల్ కలిపి పేస్ట్ లా చేయండి. ఈ పేస్ట్ ని ముఖానికి అప్లై చేసి పదిహేను నిమిషాల తరువాత కడిగేయండి. ఇలా రోజూ చేయడం వాళ్ళ మంచి ఫలితం ఉంటుంది.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here