Crime News: ఎంచక్కా ఫ్లైట్లలో వస్తారు..! సైకిళ్లపై రెక్కిచేసి, ఇళ్లుగుళ్ల చేస్తారు..!

Crime News: ఎంచక్కా ఫ్లైట్లలో వస్తారు..! సైకిళ్లపై రెక్కిచేసి, ఇళ్లుగుళ్ల చేస్తారు..!

Crime News: బడా బాబుల్లా విమానాల్లో వస్తారు… సైకిల్ పై తిరుగుతూ.. తాళం వేసిన ఇళ్లను టార్గెట్ చేస్తారు.. ఆతరువాత ఇళ్లును గుల్ల చేస్తారు. ఆ తరువాత రైల్లో సొంతూళ్లకు చెక్కెస్తారు. ఇలా దొంగతనాలకు పాల్పడే ముఠాను పట్టుకున్నారు రాచకొండ పోలీసులు. పశ్చిమ బెంగాల్ కు చెందిన దొంగలముఠా ఆటకట్టించారు.

Crime News: ఎంచక్కా ఫ్లైట్లలో వస్తారు..! సైకిళ్లపై రెక్కిచేసి, ఇళ్లుగుళ్ల చేస్తారు..!
Crime News: ఎంచక్కా ఫ్లైట్లలో వస్తారు..! సైకిళ్లపై రెక్కిచేసి, ఇళ్లుగుళ్ల చేస్తారు..!

ఇద్దరు దొంగల్ని అరెస్ట్ చేసి ఊచల వెనక్కి పంపారు. వారి వద్ద నుంచి సైకిల్, 520 గ్రాముల బంగారం, 500 గ్రాముల వెండి, రూ. 91 వేలను సహా.. మొత్తం రూ. 27.16 లక్షల సొత్తును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వివరాల్లోకి వెళితే… రాచకొండ సీపీ మహేష్ భగవత్ చెప్పిన వివరాల ప్రకారం.. వనస్థలిపురం ఎఫ్బీఐ కాలనీకి చెందిన రైటర్డ్ వీఆర్వో లక్ష్మీనరసింహ రావు గతేడాది డిసెంబర్ 18న కుటుంబంతో షాపింగ్ కు వెళ్లాడు.

Crime News: ఎంచక్కా ఫ్లైట్లలో వస్తారు..! సైకిళ్లపై రెక్కిచేసి, ఇళ్లుగుళ్ల చేస్తారు..!

అలా వెళ్లి వచ్చే వరకు ఇంటిని దొంగలు దోచేశారు. ఇంటి వెనకాల ఉన్న డోర్ తాళం పగలగొట్టి ఇంటిలోకి వెళ్లిన దొంగలు బీరువాను, అల్మారాను పగలకొట్టి 30 తులాల బంగారాన్ని దోచుకెళ్లారు. ఈ ఘటనపై బాధితుడు వనస్థలిపురం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. సైకిల్ పై వచ్చిన ఇద్దరు వ్యక్తులు కాలనీలో తిరుగుతున్నట్లు పోలీసులు గుర్తించారు. 

సీసీ పుటేజ్ ఆధారంగా ..

సీసీ పుటేజ్ ఆధారంగా దొంగలిద్దరు సాహెబ్ నగర్ లో ఓ రూంలో అద్దెకు ఉన్నట్లుగా తేల్చారు. టెక్నికల్ ఎవిడెన్స్ ఆధారంగా… చోరీ చేసిన దొంగల్ని గుర్తించారు. గతంలో కూడా ఈ ముఠా సూర్యాపేటలో దొంగతనానికి పాల్పడినట్లు పోలీసులు వెల్లడించారు. ఈనెల 4న మళ్లీ చోరీ చేసేందుకు వచ్చిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. దొంగల్ని పశ్చిమ బెంగాల్ ముషీరాబాద్, కోల్ కతాలకు చెందిన రఫికుల్ ఖాన్, షేక్ సూరజ్ లుగా గుర్తించి రిమాండ్కు తరలించారు. తెలంగాణలో వీరిపై మొత్తం 14 కేసులు ఉన్నాయి. దోచుకున్న సొమ్మును ముషీరాబాద్ కు చెందిన అనిత్ సీతారాం బండగర్, నోబిన్ అనే వ్యక్తులకు అమ్మేసేవారిని పోలీసులు వెల్లడించారు. వీరిపై కేరళ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాల్లో కేసులున్నాయని పోలీసులు వెల్లడించారు.