Featured

Sampoornesh Babu: మరోసారి మంచి మనసును చాటుకున్న సంపూర్ణేష్ బాబు… చిన్నారి ఆపరేషన్ కి ఆర్థిక సహాయం!

Sampoornesh Babu: హృదయ కాలేయం కొబ్బరిమట్ట వంటి చిత్రాల ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హీరో సంపూర్ణేష్ బాబు గురించి అందరికీ తెలిసిందే. ఈయన పలు కామెడీ సినిమాల ద్వారా ప్రేక్షకులను తనదైన శైలిలో సందడి చేస్తున్నారు.ఈ విధంగా తన నటనతో ప్రేక్షకులను నవ్వించడమే కాకుండా తన మంచి మనసుతో ఆపదలో ఉన్న వారిని ఆదుకోవడంలో కూడా సంపూర్ణేష్ బాబు ముందు వరుసలో ఉంటారు.

Sampoornesh Babu: మరోసారి మంచి మనసును చాటుకున్న సంపూర్ణేష్ బాబు… చిన్నారి ఆపరేషన్ కి ఆర్థిక సహాయం!

ఈ క్రమంలోనే ఇదివరకే ఎన్నోసార్లు ఆపదలో ఉన్న ఈయన తనకు చేతనైనంత ఆర్థిక సహాయాన్ని చేసిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి. ఈ క్రమంలోనే రెండు నెలల చిన్నారికి గుండె ఆపరేషన్ చేయాల్సి రావడంతో ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం చేసి మరోసారి తన మంచి మనసు చాటుకున్నారు.

Sampoornesh Babu: మరోసారి మంచి మనసును చాటుకున్న సంపూర్ణేష్ బాబు… చిన్నారి ఆపరేషన్ కి ఆర్థిక సహాయం!

రాజన్న సిరిసిల్ల జిల్లా.. వేములవాడ నియోజకవర్గం చందుర్తి మండలం రామన్నపేట గ్రామానికి చెందిన సంకొజి లావణ్య, రమేష్‌ దంపతులరెండు నెలల చిన్నారికి హార్ట్ ఆపరేషన్ చేయించడానికి ఆర్థిక ఇబ్బందులు ఎదురవడంతో ఈ విషయాన్ని తెలుసుకున్న సంపూర్ణేష్ బాబు స్వయంగా రమేష్ దంపతులకు ఆర్థిక సహాయం చేయడానికి ముందుకు వచ్చారు.

పాతిక వేలు ఆర్థిక సహాయం…

ఈ క్రమంలోనే మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు చింతోజు భాస్కర్‌ తో పాటు రమేష్ ఇంటికి చేరుకున్న సంపూర్ణేష్ బాబు 25 వేల ఆర్థిక సహాయం అందించారు.ఈ విధంగా చిన్నారి ఆరోగ్య పరిస్థితిని తెలుసుకొని స్వచ్ఛందంగా ముందుకు వచ్చి ఆ కుటుంబానికి ఆర్థిక సహాయం అందించడంతో నటుడు సంపూర్ణేష్ బాబు పై మానేరు స్వచ్ఛంద సంస్థ అధ్యక్షులు ప్రశంసలు కురిపించారు. అదేవిధంగా లావణ్యరమేష్ దంపతులు కూడా నటుడు సంపూర్ణేష్ బాబుకి కృతజ్ఞతలు తెలియజేశారు.ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నెటిజన్లు సంపూర్ణేష్ బాబు మనస్తత్వం పై ప్రశంసలు కురిపిస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago