Categories: FeaturedMovie News

Bengaluru Padma : డైరెక్టర్ తేజ అలా చేస్తాడని అనుకోలేదు… మురళీ మోహన్ కాలర్ పట్టుకుని బూతులు తిట్టాను…: బెంగళూరు పద్మ

Bengaluru Padma : సీరియల్స్ లోను సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను సుపరిచితురాలైన బెంగళూరు పద్మ గారు ఈ మధ్య కాలంలో ఇండస్ట్రీకి దూరంగా ఉన్నారు. జీ తెలుగులో వచ్చే ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నటించిన ఆమె ప్రస్తుతం ఏ ప్రొజెక్ట్ చేయకుండా వ్యక్తిగత జీవితంలో చాలా బిజీగా ఉన్నారు. పద్మ గారి కూతురు గాయత్రి కూడా నటి. హ్యాపీడేస్ సినిమాలో అప్పు గా నటించి మంచి గుర్తింపు అందుకుంది. ఇక తాజాగా ఒక ఇంటర్వ్యూలో మాట్లాడిన పద్మ గారు ఇండస్ట్రీలో కొన్ని ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.

తేజ అలా చేస్తాడని అనుకోలేదు…

ఎక్కువగా ఈటీవీ అలాగే సురేష్ ప్రొడక్షన్స్ లో పనిచేసిన బెంగళూరు పద్మ గారికి ఆ పేరు పెట్టింది కూడా రామానాయుడు గారే. వందలలో సినిమాల్లో పనిచేసిన పద్మ గారు సీరియల్స్ లో కూడా చాలా వాటిలో చేశారు. ఇక కొన్ని సినిమాల్లో ఒకరోజు షూటింగ్ అయ్యాక క్యారెక్టర్ ను మార్చేస్తారు. అలా డైరెక్టర్ తేజ ఒక సినిమాలో ఒక రోజు షూటింగ్ అయ్యాక మరుసటి రోజుకు వేరే ఆర్టిస్ట్ ను పెట్టుకోవడంతో కాస్త బాధగా అనిపించింది అంటూ చెప్పారు.

అయితే ఆ సినిమాలో చేయాల్సినటువంటి పాత్రను నేను కావ్యాంజలి అనే సీరియల్ లో చేశాను. తెలంగాణ యాస మాట్లాడుతూ వడ్డీ వ్యాపారం చేస్తూ చాలా రౌడీగా ఉండే ఆ క్యారెక్టర్ లో అందరినీ తిడుతుంటాను. అలా మురళీ మోహన్ గారు ఆ సీరియల్ లో ఉన్న సీన్ లో ఆయనను కూడా కాలర్ పట్టుకుని బూతులు తిట్టాను. ఆ ఎపిసోడ్ ప్రసారమయ్యాక మా నాన్న పిలిచి ఇలాంటి మాటలు ఎపుడూ మాట్లాడకు, ఇలాంటి నటన వద్దు అని చెప్పారు. ఆ బూతుకు అర్థం తెలియక ముందే తిట్టేసాను అంటూ బెంగళూరు పద్మ తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago