Categories: FeaturedMovie News

Producer Yalamanchi Ravi : చార్మి రెమ్యూనరేషన్ తీసుకుని ప్రొమోషన్స్ కి రాకుండా ఎగ్గొట్టాలని చూసింది… జయసుధ గారు న్యాయం చేసారు…: నిర్మాత యలమంచిలి రవిచంద్

Producer Yalamanchi Ravi : నిర్మాత యలమంచి రవి చంద్ అనగానే ఆయన చేసిన సినిమాల కంటే ఆయన వివాదాల ద్వారానే ఎక్కువగా గుర్తున్నారు. దాసరి నారాయణ రావు గారికి వ్యతిరేకంగా మాట్లాడి ఒకసారి అలాగే సినిమా పైరసీ మీద పోరాడి నిరాహారదీక్ష చేసిన ఈయన మాయగాడు అనే సినిమా టైములో చార్మీ తో గొడవ పడ్డారు. ఇక ఆ సమయంలో జరిగిన సంఘటనలను తాజాగా ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

మనీ తీసుకుని ఎగ్గొట్టాలని చూసింది…

యలమంచి రవి చంద్ నిర్మాతగా వేణు తొట్టెంపూడి హీరోగా చార్మీ హీరోయిన్ గా వచ్చిన సినిమా మాయగాడు. ఆ సినిమాకు దిలీప్ పొలాన్ డైరెక్టర్ కాగా సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద విజయం సాధించలేదు. అయితే సినిమా పూర్తయ్యాక ప్రొమోషన్స్ సమయంలో చార్మి ప్రొమోషన్స్ కి రాకుండా బాగా ఇబ్బందిపెట్టిందంట. ఆ సమయంలో ఆమెతో గొడవ జరగడంతో ఫిల్మ్ ఛాంబర్ వరకు పంచాయితీ నడవడం, మురళీ మోహన్ గారు పిలిచి చర్చించి మాట్లాడారని ఆమెకు రెమ్యూనరేషన్ కూడా మొత్తం ఇచ్చినా ఇలా చేయడంతో వాళ్ళు సర్ది చెప్పి పంపారు. చివరకు ప్రమోషన్స్ కి ఛార్మి వచ్చింది అంటూ చెప్పారు.

ఇక పైరసీ మీద నిరాహార దీక్షకు కూర్చున్న రోజు నేనొక్కడినే కానీ మరుసటి రోజుకు ఒక్కొక్కరిగా సినిమా ఇండస్ట్రీ వాళ్లంతా వచ్చారు. మొత్తం ఇండస్ట్రీ నాకు సపోర్ట్ చేసింది. చివరకు ప్రభుత్వం పైరసీకి పాల్పడితే కఠిన చర్యలు తీసుకోడానికి ఒప్పుకుంది. ఆ సమయంలో స్థానికంగా సీనియర్ నటి జయసుధ గారు ఎమ్మెల్యే గా ఉండటం వల్ల ఆవిడ చొరవ చూపి ప్రభుత్వం చర్యలు తీసుకునేలా సహాయం చేసారు అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago