General News

ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత పారాయణం తప్పనిసరి.. ప్రభుత్వం సంచలన నిర్ణయం!

డెహ్రాడూన్, ఉత్తరాఖండ్: ఉత్తరాఖండ్ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. ఇకపై అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో భగవద్గీత పారాయణం తప్పనిసరి చేస్తూ జూలై 14న ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఆదేశాల ప్రకారం, అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ప్రతిరోజూ ఉదయం విద్యార్థులు భగవద్గీత శ్లోకాలను పారాయణం చేయాల్సి ఉంటుంది. అంతేకాకుండా, ప్రతిరోజూ ఒక శ్లోకాన్ని, అలాగే వారానికి ఒక శ్లోకాన్ని ఎంపిక చేసి, దాని అర్థాన్ని పాఠశాల నోటీసు బోర్డులో రాయాలని ఆదేశాల్లో స్పష్టంగా పేర్కొన్నారు.

Bhagavad Gita is mandatory in government schools.. Sensational decision by the government!

మానవ విలువలు, నాయకత్వ నైపుణ్యాల పెంపొందే లక్ష్యం

శ్రీమద్ భగవద్గీత సూత్రాలు మానవ విలువలు, ప్రవర్తన, నాయకత్వ నైపుణ్యాలు, నిర్ణయం తీసుకునే సామర్థ్యం, భావోద్వేగ సమతుల్యత, శాస్త్రీయ ఆలోచనలను ఎలా అభివృద్ధి చేస్తాయో ఉపాధ్యాయులు విద్యార్థులకు అవగాహన కల్పించనున్నారు. జాతీయ విద్యా విధానం 2020 (NEP 2020) కింద భారతీయ సంప్రదాయం, జ్ఞాన వ్యవస్థ ఆధారంగా విద్యార్థులకు వివిధ విషయాలను బోధిస్తామని విద్యాశాఖ డైరెక్టర్ డాక్టర్ ముకుల్ కుమార్ సతి తెలిపారు.

అంతకుముందు, ఉత్తరాఖండ్‌లో రాష్ట్ర పాఠ్యాంశాలకు సంబంధించి మే 6న జరిగిన సమావేశంలో ముఖ్యమంత్రి పుష్కర్ సింగ్ ధామి శ్రీమద్ భగవద్గీత, రామాయణాన్ని అందులో చేర్చాలని సూచనలు ఇచ్చారు. రాబోయే విద్యా సంవత్సరం నుండి భగవద్గీత, రామాయణం పుస్తకాలు అందుబాటులోకి వస్తాయని అధికారులు తెలిపారు.

ముస్లిం మత పెద్ద స్వాగతం

ఉత్తరాఖండ్ మదర్సా విద్యా బోర్డు చైర్మన్ ముఫ్తీ షామూన్ ఖాస్మీ ప్రభుత్వ చొరవను స్వాగతించారు. పాఠశాలల్లో భగవద్గీత, రామాయణాన్ని బోధించడం, వాటిని ప్రజలకు పరిచయం చేయడం చాలా మంచి విషయమని ఆయన అన్నారు. “రాముడు, కృష్ణుడు ఇద్దరూ మన పూర్వీకులు. ప్రతి భారతీయుడు వారి గురించి తెలుసుకోవడం చాలా ముఖ్యం” అని ఆయన వ్యాఖ్యానించారు. ఈ నిర్ణయం రాష్ట్ర విద్యా రంగంలో ఒక కొత్త అధ్యాయానికి నాంది పలకనుంది.

telugudesk

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago