సల్మాన్ ఖాన్ హీరోగా నటించిన మైనే ప్యార్ కియా సినిమాలో హీరోయిన్ గా నటించారు భాగ్యశ్రీ. తెలుగు ప్రేక్షకులకు ఆమె అంతగా తెలియకపోయినా.. బాలీవుడ్ లో ప్రేక్షకులకు ఆమె పేరు సుపరిచితమే. ఆమెకు ఈ సినిమా ద్వారా ఉత్తమ నటిగా ఫిలింఫేర్ అవార్డును అందుకున్నారు.
ఆమె నటించిన మొదటి సినిమాకే అవార్డు రావడం అనేది మామూలు విషయం కాదు. తర్వాత ఆమె కొన్ని సినిమాల్లో తర్వాత బుల్లితెరపై కొన్ని సీరియల్స్ లో నటించింది. గత కొంతకాలంగా ఆమెకు ఎన్ని సినిమాలు తీసినా గుర్తింపు రాకపోవడంతో సినిమాలకు దూరంగా ఉంటున్నారు. లాక్ డౌన్ తర్వాత ఆమెకు మళ్లీ అవకాశాలు రావడం మొదలయ్యాయి.
ఆమె త్వరలో విడుదల కానున్న రాధే శ్యామ్‌లో ప్రభాస్ తల్లిగా నటించింది. అంతే కాకుండా ఆమె ‘ఛత్రపతి’ హిందీ రీమేక్‌లోనూ నటిస్తోంది. ఆమె చిత్ర దర్శకుడు సూరజ్ బర్జాత్యా సమక్షంలో హిమాలయ దసాని అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. వీరికి అభిమన్యు దస్సాని అనే కుమారుడు, అవంతిక దస్సాని అనే కుమార్తె ఉన్నారు.
అయితే అవంతిక దస్సాని ఒక తెలుగు చిత్రంలో నటించనుందని ఆమె ఇటీవల ప్రకటించారు. బెల్లంకొండ గణేష్ కి జోడీగా ఈమె నటించనున్నట్లు సమాచారం. ఇతడు నాంది సినిమా ఫేమ్ సతీష్ వేగేశ్న కోసం ఒక చిత్రానికి సంతకం చేశాడు. దీనిలోనే దస్సాని నటించనున్నట్లు సమాచారం. ఇక అవంతికకు సోషల్ మీడియాలో విపరీతమైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది.
హైదరాబాద్ ఫిబ్రవరి 19: దైవబలం ఎలా ఉంటుందో మన కన్నుల ముందు ప్రముఖ రచయిత పురాణపండ శ్రీనివాస్ జీవనంలోని పరీక్షలూ,…
2026లో తొలి చంద్రగ్రహణం త్వరలోనే సంభవించనుంది. ఈసారి హోలీ పండుగ రోజునే గ్రహణం పడనున్నట్లు ఖగోళ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. జ్యోతిష్య…
“మేడి పండు చూడు మేలిమైనుండు… పొట్ట విప్పి చూడు పురుగులండు” అనే పద్యం మనందరికీ చిన్నప్పటి నుంచే పరిచయం. బయటకు…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త సమీకరణాలకు రంగం సిద్ధమవుతోంది. కల్వకుంట్ల కవిత తాజాగా చేసిన ప్రకటనలు రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా…
తెలంగాణలో విమానయాన రంగం క్రమంగా విస్తరిస్తోంది. ఇప్పటికే రాష్ట్రానికి ప్రధాన గేట్వేగా నిలిచిన Rajiv Gandhi International Airport ద్వారా…
నెలసరి సమయంలో చాలా మంది మహిళలు కడుపు నొప్పి, నడుం నొప్పి, అలసట వంటి సమస్యలను ఎదుర్కొంటుంటారు. కొందరికి ఈ…