కన్నడ పవర్ స్టార్ పునీత్ రాజ్ కుమార్ మరణాన్ని ఆయన అభిమానులు, కన్నడ ప్రజలు ఇంకా జీర్ణించుకోలేకపోతున్నారు. పునీత్ మరణించి దాదాపు రెండు వారాలు అవుతున్నా పునీత్ సమాధిని చూడటానికి రోజూ వేలల్లో సందర్శకులు వస్తున్నారు.
ఇటీవల ఆ సమాధి వద్ద ఓ జంట పెళ్లి కూడా చేసుకున్న విషయం తెలిసిందే. అతడి మరణ వార్త విని కొంతమంది అభిమానులు గుండెపోటుతో మరణించారు. మరికొంత మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. పునీత్ కుటుంబసభ్యులు దయచేసి ఎవరూ ఆత్మహత్యలు చేసుకోవద్దని చెబుతున్నా.. అభిమానులు ఆ విషయాలను పెడచెవిన పెడుతున్నారు. ఆత్మహత్యల పర్వం అక్కడ కొనసాగుతూనే ఉంది. దీంతో పునీత్ కుటుంబసభ్యులు, కన్నడ సినీ పరిశ్రమ ప్రముఖులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
పునీత్ పెద్దన్నయ్య రాఘవేంద్ర రాజ్‌కుమార్ ఇటీవల ఆత్మహత్య చేసుకున్న ఓ అభిమాని కుటుంబాన్ని పరామర్శించారు. దయచేసి అభిమానులు ఎవరూ ఆత్మహత్యలకు పాల్పడవద్దని, ఆత్మహత్య చేసుకొని చనిపోయిన అభిమాని కుటుంబానికి అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఇదిలా ఉండగా.. పునీత్ కుటుంబసభ్యులను పరామర్శించేందుకు చిత్రదుర్గ మురుఘ రాజేంద్ర బృహమఠం డాక్టర్ శివమూర్తి మురుఘా వచ్చారు.
పునీత్ మరణం తర్వాత ఆయనకు బసవశ్రీ ప్రశస్తిని ప్రకటించారు. ప్రశస్తిని స్వీకరించడానికి పునీత్ భార్య అశ్వినిని ఆహ్వానించారు. పునీత్ అభిమానులు కొంతమంది అన్నదాన కార్యక్రమాలను నిర్వహించారు. నిర్వహించిన వారిలో టి.నరసిపుర తాలూకా బసవనహళ్ళి అభిమానులు, గ్రామస్తులు ఉన్నారు. అందులో ఓ అభిమాని గుండు కొట్టించుకొని పునీత్ కు నివాళులు అర్పించాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…