భారతదేశానికి 1947లో వచ్చింది నిజమైన స్వాతంత్ర్యం కాదని… అది ఒక భిక్ష అంటూ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అంటే 2014లోనే అసలైన స్వాతంత్ర్యం వచ్చిందని..ఆమె ఇటీవల అన్నారు.
దీంతో ఆ మాటలు సోషల్ మీడియాలో తీవ్ర దుమారం రేపాయి. తాజాగా ఆ వ్యాఖ్యలపై సీపీఐ నేత నారాయణ స్పందిస్తూ కంగనాపై మండిపడ్డారు. కంగనా ఒక అత్యంత విలాసవంతమైన బిచ్చగత్తె అంటూ ఘాటు విమర్శలు చేశారు. ఆమెకు పద్మ శ్రీ అవార్డు ఎలా వచ్చిందో అందరికీ తెలుసని.. దేశ స్వాతంత్ర్యం గురించి మాట్లాడే నైతిక అర్హత కంగనాకు లేదన్నారు నారాయణ.
ఈ వ్యాఖ్యల పై ఆమె బానసత్వానికి ప్రతీకలుగా నిలుస్తున్నాయని.. దేశ ప్రజలకు ఆమె వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశాడు. లేకపోతే పరిణామాలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించాడు. బాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా ఉన్న కంగనా ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. ఈ మధ్య కొన్ని కొన్ని విషయాలకు స్పందిస్తూ.. విమర్శలపాలు అవుతున్నారు.
దీనిలో భాగంగానే ఆమె ఇలాంటి వ్యాఖ్యలు చేయడంతో నెటిజన్లు కూడా కొంతమంది ఆగ్రహానికి గురవుతున్నారు. ఇక సీపీఐ నేత నారాయణ విషయానికి వస్తే.. అతడు కూడా ఇటీవల సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటున్నారు. బిగ్ బాస్ సీజన్ 5 గురించి మాట్లాడుతూ.. దీని వల్ల ఎవరికీ ఉపయోగం లేదని.. వీటిని వెంటనే బ్యాండ్ చేయాలని కోరిన విషయం తెలిసిందే.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…