Featured

Bharath reddy : దృశ్యం, శ్రీమంతుడు సినిమాల్లో నన్ను కావాలనే తీసేసారు… ఎందుకు ఇలా చేసారని అడిగితే..: క్యారెక్టర్ ఆర్టిస్ట్ భరత్ రెడ్డి

Bharath Reddy : డాక్టర్ కావాల్సిన వాడు యాక్టర్ అయ్యాడు అంటూ కొంతమందిని అంటూ ఉంటాం. కానీ ఈ వ్యక్తి మాత్రం డాక్టర్ అయి ఆ తరువాత యాక్టర్ అయ్యాడు. అలా అని తన వైద్య వృత్తిని వదిలేయలేదు. అటు డాక్టర్ గా సేవాలాందిస్తూనే మరోవైపు సినిమాల్లో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా నటిస్తున్నారు. అతను మరెవరో కాదు క్యారెక్టర్ ఆర్టిస్ట్ భరత్ రెడ్డి. చాలా సినిమాల్లో పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తూ ఉండే భరత్ రెడ్డి నిజానికి డాక్టర్ అని చాలా మందికి తెలియదు. వెంకటేష్ గారి సినిమా ‘ఈనాడు’ ద్వారా గుర్తింపు తెచ్చుకున్న భరత్ రెడ్డి ఆ తరువాత చాలా సినిమాల్లో నటించారు.

ఆ సినిమాల్లో నన్ను తీసేసారు…

కార్డియాలజిస్ట్ గా తన విధులు నిర్వర్తిస్తూనే మరోవైపు సినిమాల్లో నటిస్తున్న భరత్ రెడ్డి ఒక్కోసారి సినిమా అవకాశాలను వదులుకోవాల్సి వచ్చేదంటూ చెప్పారు. అయితే కొన్నిసార్లు సినిమాల్లో అవకాశం ఇచ్చి అడ్వాన్స్ ఇచ్చాక తీసేసిన సంఘటనలు ఉన్నాయంటూ తెలిపారు. వెంకటేష్ గారి ‘దృశ్యం’ సినిమాల్లో మొదట నన్ను అనుకుని కన్ఫర్మ్ చేసాక హైట్ ఉన్నానని భావించి ఆ సినిమాలో తీసేసారు అంటూ చెప్పారు.

ఇలా కొన్ని సినిమాలకు జరిగిందని హీరో పక్కన డామినేట్ చేసేలా ఉన్నప్పుడు డైరెక్టర్స్ రిస్క్ చేయలేరు అంటూ భరత్ చెప్పారు. ఇక శ్రీమంతుడు సినిమాలో మొదట నవీన్ రవిచంద్ర క్యారెక్టర్ కు నన్ను సెలెక్ట్ చేసారు. మేనేజర్ తో మాట్లాడి డేట్స్ బుక్ చేసి అడ్వాన్స్ ఇచ్చాక నన్ను తీసేసి నవీన్ ను పెట్టుకున్నారు. ఫోన్ చేసి అడిగితే అసలు వారికి ఏమాత్రం తెలియలేదు. మధ్యలో ఉన్న వాళ్ళు ఇలా చేసారని తెలిసింది. ఒక సినిమా తీయాలంటే ఎంతో మంది కలిసి పనిచేస్తుంటారు మధ్యలో ఇలాంటి పాలిటిక్స్ జరుగుతుంటాయి అనుకుని వదిలేసా అంటూ ఆయన ఆనుభవాలను పంచుకున్నారు భరత్ రెడ్డి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago