Featured

Ram Gopal Varma : సినిమా చెండాలంగా ఉంది కుదిరితే ఆపేయమని చెప్తే… నాగార్జున ఒకటే చెప్పారు… ఇళయరాజా కాకుండా ట్రాక్స్ వాడుంటే సినిమా రిజల్ట్ ఇంకోలా ఉండేది..: ఆర్జివి

Ram Gopal Varma : తెలుగు సినిమాకు కొత్త ట్రెండ్ ను తెచ్చిన ట్రెండ్ సెట్టర్ వర్మ. శివ సినిమాతో ఒక్కసారిగా టాలీవుడ్ సినిమా తీరును మార్చేశాడు. స్టడీ కెమెరాను వాడి సినిమా విజువల్స్ కి కొత్తదనం తీసుకొచ్చి అలానే సినిమా పంథాను మార్చి అందరినీ ఆకర్శించాడు వర్మ. వివాదాలతో బతికే వర్మ లో ఒక మంచి టెక్నీషియన్ ఉన్నాడు. ఇది ఎవరూ కాదనలేని సత్యం. తాను తీసిన పాత సినిమాలను చూస్తే ఎవరైనా ఆర్జీవి ఫ్యాన్ అవ్వాల్సిందే. అయితే ఇదంతా ఒకప్పుడు, ఇప్పుడు ఉన్న వర్మ వేరు. అయితే తాజాగా శివ సినిమా గురించి విశేషాలను వర్మ ఒక ఇంటర్వ్యూలో పంచుకున్నారు.

సినిమా చెండాలంగా ఉందని చెప్పారు…

శివ సినిమా టైములో బౌండెడ్ స్క్రిప్ట్ లేకుండానే మొదటి సారి సినిమా డైరెక్ట్ చేస్తున్నా పర్ఫెక్ట్ గా చేసి మంచి హిట్ అందుకోవడమే కాకుండా ఆ సినిమాతో తెలుగు సినిమా ట్రెండ్ మార్చేశాడు ఆర్జీవి. అలాంటి శివ సినిమా ఇంకా రీ రికార్డింగ్ అవ్వక ముందే నాగార్జున కు సన్నిహితుడైనా సురేంద్ర ఆయన స్నేహితులకు సినిమా చూపించగా సినిమా చెండాలంగా ఉంది కుదిరితే విడుదల చేయొద్దు అని చెప్పారట.

ఇద్దరు ముగ్గురు అలానే చెప్పడంతో ఆలోచనలో పడి వేరే సినిమాల్లోని ట్రాక్స్ వాడుకుందాం కనీసం సినిమాకు ప్లస్ అవుతుంది అనుకుంటే నాగార్జున గారు ఇది వర్మ సినిమా తనకు నచ్చినట్లు తీయనియ్యండి, రిజల్ట్ ఎలా ఉన్నా పర్వాలేదు అని చెప్పి ఫైనల్చే శారట. అలా ఇళయరాజా గారితోనే ముందు అనుకున్నట్లుగా రీ రికార్డింగ్ చేసి సినిమా విడుదల చేశారట. ఈ విషయాలను చెబుతూ ఒకవేళ ఇళయరాజాతో కాకుండా వేరే సినిమాల్లోని ట్రాక్స్ వాడుంటే సినిమా ఫలితం వేరేగా ఉండేదంటూ ఆర్జీవి చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago