Bhardwaja : తెలుగు ఇండస్ట్రీలో ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఈ ఇద్దరూ ఇండస్ట్రీ కి రెండు కళ్ళు అంటారు. తెలుగు సినిమాకు జీవం పోశారు వాళ్లిదరు. ఇక వారి తరువాత ఇండస్ట్రీ ని మళ్ళీ పరుగులు పెట్టించిన మాస్ హీరో చిరంజీవి. ఎంత మంది హీరోలు ఉన్నా చిరంజీవి సినిమా బిజినెస్ వేరు. సినిమా కథ తో సంబంధం లేకుండా టేబుల్ బిజినెస్ జరిగిన హీరో అంటే చిరునే. ఎంతో మంది ఇండస్ట్రీ కి రావడానికి ఆయనే స్ఫూర్తి. ఒక్కో మెట్టు ఎక్కుతూ ఇపుడు ఎవరెస్ట్ అంత ఎత్తు ఎదిగినా ఇంకా సమాజం కోసం ఆలోచిస్తూ ఇండస్ట్రీ కి పెద్ద దిక్కుగా ఉన్న మెగాస్టార్ కు సలహా ఇచ్చి ఇండస్ట్రీ కి రావడానికి కారణమైన స్టార్ హీరో ఎవరో తెలుసా…
ఆ హీరో సలహా మేరకు మద్రాస్ కి వెళ్లిన చిరు…
సినిమాల మీద ఇష్టం ఉన్నా ఎలా ఇండస్ట్రీ లోకి వెళ్లాలో దారి తెలియక సంశయంలో ఉన్న సమయంలో ఎంతో మందికి నేడు స్ఫూర్తి గా నిలిచిన మెగాస్టార్ కు ఒక హీరో ఎలా వెళ్లాలో దారి చూపాడు అంటూ అప్పటి విషయాలను సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు చెప్పారు. పాలకొల్లు సమీపంలో ‘చిలకమ్మ చెప్పింది’ సినిమా షూటింగ్ కోసం రజనీకాంత్, నారాయణ రావు గారు వెళ్లగా వాళ్లిదరూ ఆ సినిమాలో మెయిన్ లీడ్ చేస్తున్నారు. ఆ సమయంలో చిరంజీవి గారి ఊరు అక్కడికి దగ్గరగా ఉండటంతో షూటింగ్ చూడటం కోసం అక్కడికి వెళ్లి తన అభిరుచి సినిమా యూనిట్ లో ఒకరికి చెప్పి అడిగితే వెళ్లి రజనీకాంత్, నారాయణ రావు ను కలిసి సలహా తీసుకోమని చెప్పాడట. ఇక రజనీకాంత్ కి తనకు సినిమాలో నటించాలని ఉందని తన ఆసక్తిని చెప్పగా తాను సౌత్ ఫిల్మ్ ఛాంబర్ ఆధ్వర్యంలో ఉన్న ఫిల్మ్ ఇన్స్టిట్యూట్ లో వెంటనే చేరమని సలహా ఇచ్చాడు.
నేను అందులోనే ఉన్నాను అంటూ రజనీకాంత్ గారు చెప్పారు. అలా ఇంట్లో చదువు కోసం మద్రాస్ అని చెప్పి సినిమాల్లో చేరడానికి ఇన్స్టిట్యూట్ కి వెళ్లిన చిరంజీవి కి ప్రాణం ఖరీదు, పునాది రాళ్లు వంటి సినిమాల్లో అవకాశాలు వచ్చాయి. అలా ఒక్కో అవకాశాన్ని సద్వినియోగం చేసుకుంటూ మెగాస్టార్ గా ఎదిగాడు. ఇక మొదట్లో చిరంజీవి ని రజనీకాంత్ లాగా నటిస్తున్నాడు, అనుకరిస్తున్నాడు అంటూ విమర్శలు వచ్చినా ఆ తరువాత రాజనీకాంత్ గారే ‘నేను, కమల్ హాసన్ కలిస్తే.. చిరంజీవి’ అంటూ ప్రశంసించారు. రజనీకాంత్ యాక్షన్ బాగా చేయగలరు కానీ డాన్సల్లో కమల్ కి పోటీ లేదు కానీ చిరంజీవి యాక్షన్ తో పాటూ డాన్స్ కూడా అంతే బాగా చేయగలరు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…