Categories: FeaturedMovie News

Mehaboob dil se : అమ్మ చావు బతుకుల మధ్య ఉంటే చిరంజీవి గారు 10 లక్షల సాయం చేసారు.. చనిపోయే ముందు అమ్మ చెప్పిన మాటలు అవే : మెహబూబ్ దిల్ సే

Mehaboob dil se : టిక్ టాక్, రీల్స్ ద్వారా డాన్స్ చేస్తూ వీడియోస్ చేస్తూ కొంచెం గుర్తింపు తెచ్చుకున్న మెహబూబ్ దిల్ సే ఆ తరువాత బిగ్ బాస్ అవకాశంతో జీవితం కొత్త మలుపు తీసుకుంది. కెరీర్ లో బిగ్ బాస్ పిలుపు ముందుకు నడిపింది. బిగ్ బాస్ వల్ల వచ్చిన గుర్తింపు తో అటు టీవీ ఛానెల్స్ లో అవకాశాలు సినిమా అవకాశాలతో పాటు యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు తీస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు మెహబూబ్ దిల్ సే. చేస్తున్న సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ఇష్టపడిన కెరీర్ కోసం కష్టాలు పడుతూ సక్సెస్ కి దగ్గరగా వచ్చినపుడు జీవితంలో అనుకోని ఆపద ఎదురైంది, అదే తల్లి మరణం. అనుకోకుండా అమ్మ మరణించడం మెహబూబ్ జీవితంలో కోలుకోలేని బాధను మిగిల్చింది.

చిరంజీవి గారు 10 లక్షల ఆర్థిక సహాయం చేసారు…

కరోనా ముందు సోషల్ మీడియాలో మంచి పేరు రావడంతో దాన్నే కెరీర్ గా మలచుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా ఇండస్ట్రీ కి వచ్చాడు మెహబూబ్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మెహబూబ్ ది గుంటూరు. ఎవరో ఒకరినే చదివించగల స్థోమత ఉండటంతో తమ్ముడు షాప్ కి వెళ్లగా మెహబూబ్ చదువుకున్నాడు. ఇక ఉద్యోగం మానేయడం ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వేళ కరోనా లాక్ డౌన్ వల్ల ఆర్ధిక ఇబ్బందులు పడాల్సి వచ్చిందట. ఇక కరోనా సమయంలో తల్లికి కరోనా రావడం చాలా సీరియస్ అవడంతో హైదరాబాద్ తరలించి అక్కడే వైద్య సహాయం తీసుకున్నారు.

అప్పటికే బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన మెహబూబ్ కి చిరంజీవి గారు 10 లక్షలు ఆర్థిక సహాయం చేసారు. ఇక మిగిలిన డబ్బులు తానే సర్దుబాటు చేసుకున్నాడు. అప్పుడు బయటపడిన మెహబూబ్ తల్లి ఆ తరువాత కొన్ని నెలలకు నార్మల్ గానే ఉన్నా ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరగడంతో హాస్పిటల్ కి వెళ్లగా పల్స్ పడిపోయి సీరియస్ అయి సడన్ గా చనిపోయారు. ఈ మరణం వారి కుటుంబాన్ని బాగా క్రుంగదీసింది. చనిపోక కొద్ది రోజుల ముందు మెహబూబ్ కే పుట్టినరోజున రాత్రికి ఫోన్ చేసి దేవుడిని ప్రార్థించి, కెరీర్ లో మంచి స్థాయిలో ఉండు, తమ్ముడిని బాగా చూసుకో సెటిల్ చేయి అంటూ చెప్పారట. ఇక ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులు లేకపోయినా తల్లికి ఇచ్చిన మాట ప్రకారం కెరీర్ లో మంచి స్థాయికి వెళ్లాలని మెహబూబ్ ఎయిమ్ పెట్టుకున్నాడు. యూట్యూబ్ లో ప్రస్తుతం ‘నచ్చావే’ అనే వెబ్ సీరిస్ తో వస్తున్నాడు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

5 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago