Mehaboob dil se : టిక్ టాక్, రీల్స్ ద్వారా డాన్స్ చేస్తూ వీడియోస్ చేస్తూ కొంచెం గుర్తింపు తెచ్చుకున్న మెహబూబ్ దిల్ సే ఆ తరువాత బిగ్ బాస్ అవకాశంతో జీవితం కొత్త మలుపు తీసుకుంది. కెరీర్ లో బిగ్ బాస్ పిలుపు ముందుకు నడిపింది. బిగ్ బాస్ వల్ల వచ్చిన గుర్తింపు తో అటు టీవీ ఛానెల్స్ లో అవకాశాలు సినిమా అవకాశాలతో పాటు యూట్యూబ్ లో వెబ్ సిరీస్ లు తీస్తూ కెరీర్ లో దూసుకుపోతున్నాడు మెహబూబ్ దిల్ సే. చేస్తున్న సాఫ్ట్ వేర్ జాబ్ వదిలేసి ఇష్టపడిన కెరీర్ కోసం కష్టాలు పడుతూ సక్సెస్ కి దగ్గరగా వచ్చినపుడు జీవితంలో అనుకోని ఆపద ఎదురైంది, అదే తల్లి మరణం. అనుకోకుండా అమ్మ మరణించడం మెహబూబ్ జీవితంలో కోలుకోలేని బాధను మిగిల్చింది.

చిరంజీవి గారు 10 లక్షల ఆర్థిక సహాయం చేసారు…
కరోనా ముందు సోషల్ మీడియాలో మంచి పేరు రావడంతో దాన్నే కెరీర్ గా మలచుకోవాలనే ఉద్దేశంతో చేస్తున్న సాఫ్ట్ వేర్ ఉద్యోగానికి రాజీనామా చేసి సినిమా ఇండస్ట్రీ కి వచ్చాడు మెహబూబ్. మధ్యతరగతి కుటుంబానికి చెందిన మెహబూబ్ ది గుంటూరు. ఎవరో ఒకరినే చదివించగల స్థోమత ఉండటంతో తమ్ముడు షాప్ కి వెళ్లగా మెహబూబ్ చదువుకున్నాడు. ఇక ఉద్యోగం మానేయడం ఇండస్ట్రీ లో అవకాశాల కోసం ప్రయత్నిస్తున్న వేళ కరోనా లాక్ డౌన్ వల్ల ఆర్ధిక ఇబ్బందులు పడాల్సి వచ్చిందట. ఇక కరోనా సమయంలో తల్లికి కరోనా రావడం చాలా సీరియస్ అవడంతో హైదరాబాద్ తరలించి అక్కడే వైద్య సహాయం తీసుకున్నారు.

అప్పటికే బిగ్ బాస్ నుండి బయటికి వచ్చిన మెహబూబ్ కి చిరంజీవి గారు 10 లక్షలు ఆర్థిక సహాయం చేసారు. ఇక మిగిలిన డబ్బులు తానే సర్దుబాటు చేసుకున్నాడు. అప్పుడు బయటపడిన మెహబూబ్ తల్లి ఆ తరువాత కొన్ని నెలలకు నార్మల్ గానే ఉన్నా ఒక్కసారిగా షుగర్ లెవెల్స్ పెరగడంతో హాస్పిటల్ కి వెళ్లగా పల్స్ పడిపోయి సీరియస్ అయి సడన్ గా చనిపోయారు. ఈ మరణం వారి కుటుంబాన్ని బాగా క్రుంగదీసింది. చనిపోక కొద్ది రోజుల ముందు మెహబూబ్ కే పుట్టినరోజున రాత్రికి ఫోన్ చేసి దేవుడిని ప్రార్థించి, కెరీర్ లో మంచి స్థాయిలో ఉండు, తమ్ముడిని బాగా చూసుకో సెటిల్ చేయి అంటూ చెప్పారట. ఇక ప్రస్తుతం ఆర్ధిక ఇబ్బందులు లేకపోయినా తల్లికి ఇచ్చిన మాట ప్రకారం కెరీర్ లో మంచి స్థాయికి వెళ్లాలని మెహబూబ్ ఎయిమ్ పెట్టుకున్నాడు. యూట్యూబ్ లో ప్రస్తుతం ‘నచ్చావే’ అనే వెబ్ సీరిస్ తో వస్తున్నాడు.



























