Bhardwaja : రవితేజ హీరోగా, వేణు తోట్టెం పూడి కీలక పాత్రలో వస్తున్న సినిమా రామరావు ఆన్ డ్యూటీ. పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో నటిస్తున్న రవితేజ ఈ సినిమా త్వరలో విడుదల అవ్వబోతుంటే ఈ సినిమా నుండి ఒక పవర్ ఫుల్ డైలాగు లీక్ అయి చిత్ర బృందాన్ని కలవరపెట్టింది. ఇక ఆ డైలాగు ప్రస్తుత గవర్నమెంట్ మీద సటైర్ అంటూ కొంతమంది ఆ డైలాగు ను వైరల్ చేయడంతో చర్చ మొదలయింది. ఇక ఈ ఇష్యూ పై తనదైన శైలిలో కామెంట్స్ చేసారు సీనియర్ జర్నలిస్ట్ భరద్వాజ గారు.
జగన్ ప్రభుత్వం పై టార్గెట్…
సినిమాలోని డైలాగు భూ కబ్జాలు, ఆక్రమణల గురించి ఉండటంతో ఆది ఖచ్చితంగా జగన్ గవర్నమెంట్ మీద టార్గెట్ అంటూ చాలా మంది అంటున్నారు. అయితే ఈ ఇష్యూ పై భరద్వాజ గారు స్పందిస్తూ జగన్ గవర్నమెంట్ మీద టార్గెట్ ఏం కాదు అలా చూపించి సినిమాకు హైప్ తేవాలని ప్రయత్నిస్తున్నారు అంటూ చెప్పారు. సినిమా నుండి డైలాగ్ ఎవరన్నా లీక్ చేసారో లేక సినిమా యూనిట్ కావాలని లీక్ చేసి హైప్ తేవడానికి ప్రయత్నిస్తుందో తెలియదు. ఇలా వివాదాలు క్రియేట్ అయితే సినిమాకు హైప్ వచ్చి జనాలు థియేటర్ కి వస్తారని సినిమా యూనిట్ అనుకుని ఉండవచ్చు అంటూ చెప్పారు. ఇక మాచర్ల నియోజకవర్గం సినిమా విషయంలో కూడా డైరెక్టర్ ఇతర కులాలను కించపరిచాడంటూ వివాదం చేసారు.
ఇవన్నీ సినిమాకు మంచి హైప్ ఇచ్చి జనాలను థియేటర్లకు రప్పించడానికి పనికి వస్తాయని భావిస్తారు. కానీ జనాలు ఇప్పుడు సినిమాల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహారిస్తున్నారు. సినిమా రివ్యూ చూసి సినిమా బాగుందన్నాకే వెళ్తున్నారు. అభిమాన హీరో అని మార్నింగ్ షోకే వెళ్లిపోవడం లేదు. ఈ విషయంలో ఆచార్య సినిమా విషయంలో అర్థమైపోయింది. చిరంజీవి లాంటి హీరో కి ఓపెనింగ్స్ రాలేదు. ప్రేక్షకుల అభిరుచి మారిపోయింది. సినిమా టికెట్ రేట్లు పెరగడం, ఇక థియేటర్లో స్నాక్స్ రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల సినిమా ఇంట్లో ఓటీటీ లో చూడటానికి మొగ్గుచూపుతున్నారు అంటూ విశ్లేషించారు. కంటెంట్ ఉంటేనే సినిమా ఆడుతుంది లేదంటే అంతే అంటూ చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…