Kalyan Ram : నందమూరి నట వారసుడిగా సినిమా ఇండస్ట్రీ లోకి అడుగుపెట్టిన నందమూరి కళ్యాణ్ రామ్ ‘తొలి చూపులోనే’ సినిమాతో హీరోగా ఎంట్రీ ఇచ్చాడు. ఆ సినిమా ఆశించినంత విజయం సాధించకపోవడంతో ఆ తరువాత సొంత బ్యానర్ పెట్టి అతనోక్కడే సినిమాచేసి కమర్షియల్ హిట్ కొట్టాడు. అలాగే ఇండస్ట్రీ కి ఒక కొత్త డైరెక్టర్ ను పరిచయం చేసాడు. ఇక ఆ సినిమా తరువాత ఎన్నో ఒడిదుడుకులను కళ్యాణ్ రామ్ తన కెరీర్ లో చూసాడు. ఇక పటాస్, 118 వంటి మంచి విజయాలు ఉన్నా కళ్యాణరామ్ సొంత బ్యానర్లో నే సినిమాలను నిర్మించారు. అలాగే కొత్త దర్శకులను టెక్నీషియన్స్ ను ఇండస్ట్రీ కి పరిచయం చేసాడు.
ఆ సినిమా ఆర్థికంగా దెబ్బ కొట్టింది…
ప్రస్తుతం ‘బింబిసార’ అనే సోషియో ఫాంటసీ సినిమాతో వస్తున్న కళ్యాణ్ రామ్ ఆ సినిమా ప్రమోషన్స్ లో భాగంగా తన కెరీర్ లోని ఆసక్తికర విషయాలను మాట్లాడారు. హిట్లు ప్లాపులు సినిమా ఇండస్ట్రీ లో కామన్ కానీ ఒక్కోసారి సొంత నిర్మాణంలో వచ్చే చిత్రాల వల్ల అవి డిజాస్టర్ అయితే బాగా నష్టపోవాల్సి వస్తుంది. ఇక అలాంటి ఒక పరిస్థితి కళ్యాణ్ రామ్ ఎదుర్కొన్నాడు. ‘ఓం 3డి’ సినిమా తీసిన కళ్యాణ్ రామ్ ఆ సినిమా వల్ల బాగా నష్టపోయాడు. ఇండియాలోనే మొదటి యాక్షన్ 3 డి సినిమా అయిన ఓం భారీ బడ్జెట్ తో రూపొందింది. అయితే సినిమా డిజాస్టర్ అవడంవల్ల నష్టాలు చూడాల్సి వచ్చింది.
ఈ విషయాలను కళ్యాణ్ రామ్ స్వయంగా చెప్పారు. ప్లాపులు వచ్చినా వై మరో సినిమా హిట్ అయినప్పుడు కవర్ అయ్యాయి. కానీ ఓం సినిమా బడ్జెట్ మా చేయి దాటిపోయింది అప్పుడు నష్టాలు బాగా వచ్చాయి. వాటిని సర్ధడానికి సమయం పట్టింది అంతే తప్పా ఇంక ఏ సినిమా విషయంలోనూ ఇబ్బంది పడలేదని చెప్పారు. బింబిసార ప్రీ రిలీజ్ ఈవెంట్ కి ముఖ్య అతిధి తన తమ్ముడు తారక్ అని చెప్పాడు. ఇక బింబిసార సినిమా ఏమైందో చూసాక తారక్ రెస్పాన్స్ ను ప్రీ రిలీజ్ ఈవెంట్ లో తన ద్వారా నే తెలుసుకోండని సస్పెన్స్ లో పెట్టాడు కళ్యాణ్ రామ్. ఇక బాలకృష్ణ ఇంకా సినిమా చూడలేదని, బాబాయ్ నాకు సినిమాల్లో అక్షరాభ్యాసం చేసారని ఆయన కర్నూల్ షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఆయన వచ్చాక సినిమా చూపిస్తానని చెప్పారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…