కొన్ని సినిమాలు డబ్బింగ్ ద్వారా వేరే భాషల్లో విడుదలైనప్పుడు ఆ సినిమాలోని డైలాగ్స్, పాటలు కావాల్సిన భాష లోకి మార్చినప్పుడు సినిమా తీసిన దానికంటే రెట్టింపు శ్రమ అవసరమవుతుంది. అలాంటిది ఎన్నో సినిమాలు ప్రస్తుతం టాలీవుడ్ లో తెరకెక్కగా.. ఇటీవలే విడుదలైన తమిళ్ సినిమా ఆకాశం నీ హద్దురా కూడా డబ్బింగ్ ద్వారా తెలుగులో తెరకెక్కింది.
ఇక ఈ సినిమా మంచి సక్సెస్ అందుకోగా.. ఇందులో మంచి విజయాన్ని అందుకున్న పాట ‘కాటుక కనులే’. ఇక ఈ పాట ప్రేక్షకులను బాగా ఆకట్టుకోగా.. తమిళంలో కూడా ఈ పాట మంచి విజయాన్ని అందుకుంది. ఇక ఈ పాట గురించి ఇందులో వాడిన పదాల గురించి భాస్కర్ బట్ల కొన్ని విషయాలు పంచుకున్నాడు.
పల్లవి మొదలు నుండి చివరి వరకు ప్రతి పదానికి ఓ అర్థం, సందర్భం ఉందని తెలిపాడు. ఈ పాటలో ఈ నాయిక బిడియం అంటే తెలియని అమ్మాయని, కథానాయకుడి లానే సొంత సంస్థను నడపాలి అనుకుంటుందని, అందుకే తనపై ఇష్టమున్న వద్దంటుంది. అలాంటివి అతడు రెండేళ్ల తర్వాత వెతుక్కుంటూ వస్తే తనలో ఉప్పొంగే ప్రేమను ఈ ప్రేమ పాట ద్వారా తెలుపుతుందని దర్శకులు తెలిపారని చెప్పుకొచ్చాడు.
కాటుప్పయలే (మొరటోడ) అనే పదం తమిళ పాటలో మొదలవుతుందని, ఇక ఆ పదాన్ని అలాగే వాడకుండా దానికి దగ్గరగా వచ్చే పదాన్ని కాటుక కనులే మెరిసిపోయే అనే పెట్టారని తెలిపాడు. ఇక జాతరలో పూనకాలు వస్తే వంటి పైన వేపాకులు పోస్తుంటారని.. ఆ ఉద్దేశంతో ఉగ్రస్వరూపిణిలాంటి ఈ హీరోయిన్ కి ప్రేమ అనే పూనకం వచ్చినందున ‘ వేపచెట్టు ఆకులన్నీ గుమ్మరించినట్టు ఈడు కెంత జాతరొచ్చెరా’ అని పెట్టారట.
అంతేకాకుండా ఈ హీరోయిన్ అవకాశం ఇస్తే ప్రపంచాన్నే చుట్టే అంతా అమ్మాయి గా ఉందని.. అలాంటి ఆమె ఎదురుచూపుల పరిధి చాలా పెద్దది అంటూ ఓ పెద్ద గాలిగోపురం పైనుంచి చూసే పక్షికి పోలిక తెచ్చుకున్నానంటూ..’ గోపురాన వాలివున్న పావురాయిలా ఎంత ఎదురు చూసినానో అన్ని దిక్కులా’ అని పెట్టారట. ఇక ఆ తర్వాత నువ్వు వచ్చినట్టు ఏదో అలికిడవ్వగా చిట్టి గుండె గంతులేసే జింక పిల్లలా రాశారట. కానీ జింక పిల్ల అన్నది అరిగిపోయిన పదముల అనిపిస్తే చెవులపిల్లిలా పెట్టాడట.
ఇక ఇక హీరో చూపుని సూది తోనూ, నవ్వుని దారం తో పోల్చి వాటి అర్థాలతో నన్ను నీతో కలిపి కుట్టేయ్యరా అని పెట్టారట. ఇందులో తన ప్రేమ వైనం చులకనగా కాకుండా ఇక చివరి పాదంలో నిన్ను గుచ్చుకుంటా ఆఆ.. నల్లపూసలాగా అనే లైను కుదరకపోగా అంటి పెట్టుకుంటా వెన్నుపూస లాగా అని వాడారని భాస్కర్ భట్ల తెలిపాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…