టాలీవుడ్ ఇండస్ట్రీలో టాప్ మోస్ట్ హీరోయిన్లలో ఒకరిగా రాణిస్తున్న పూజా హెగ్డే గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం చేతినిండా సినిమాలతో ఎంత బిజీగా గడుపుతున్న ఈ బుట్టబొమ్మ తాజాగా కరోనా బారిన పడ్డట్టు తెలుస్తోంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా కరోనా సెకండ్ వేవ్ విస్తృతంగా వ్యాపిస్తుంది. ఈ క్రమంలోనే సాధారణ వ్యక్తుల నుంచి సినీ ప్రముఖులు, రాజకీయ నాయకుల వరకు ఎవరిని వదలకుండా ప్రతి ఒక్కరిని వెంటాడుతోంది.
ఈ క్రమంలోనే నటి పూజా హెగ్డే కూడా కరోనా బారిన పడినట్టు తెలుస్తోంది. పూజ కరోనా బారిన పడిన విషయం తానే స్వయంగా ట్విట్టర్ ద్వారా తెలియజేశారు. ప్రతి ఒక్కరికి నమస్కారం నాకు covid-19 పాజిటివ్ గా తేలింది.ఈ క్రమంలోనే క్వారంటైన్ కి వెళ్లాను. ప్రస్తుతం ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉంది. కరోనా జాగ్రత్తలను, ప్రోటోకాల్ ను పాటిస్తూ తగు జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు ఆమె ట్విట్టర్ ద్వారా వెల్లడించారు.
పూజా హెగ్డే కరోనా బారిన పడటంతో గత కొన్ని రోజుల నుంచి తనతో కలిసిన సన్నిహితులకు కరోనా నిర్ధారణ పరీక్షలు చేయించుకోవాల్సినదిగా ఆమె తెలియజేశారు. ఈ సమయంలో నాకోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికి ప్రత్యేక ధన్యవాదాలు అంటూ పూజ పేర్కొన్నారు.
ఇక సినిమాల విషయానికొస్తే పూజాహెగ్డే అఖిల్ సరసన “మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్”, ప్రభాస్ “రాధేశ్యామ్” చిత్రాలలో నటించారు.అదేవిధంగా మెగాస్టార్ “ఆచార్య” సినిమాలో రామ్ చరణ్ తేజ్ కు జోడిగా పూజాహెగ్డే నటిస్తున్న సంగతి మనకు తెలిసిందే.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…