తూర్పుగోదావరి జిల్లా, సామర్లకోట భీమేశ్వరస్వామి వారి ఆలయంలో.. మహా శివరాత్రి వేడుకలు ప్రతి సంవత్సరం ఘనంగా జరుగుతాయి. ఈ క్రమంలో మహాశివరాత్రి సందర్భంగా భారీ ఎత్తున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ అన్నదాన కార్యక్రమంలో దాదాపు 20 వేలకు పైగా భక్తులు పాల్గొన్నారు. తిమ్మాపురం గ్రామానికి చెందిన కర్రీ వెంకటరాజు అనే వ్యక్తి… అయన తండ్రి సత్యనారాయణ పేరు మీద ఈ అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. గత 20 సంవత్సరాలుగా భీమేశ్వవరస్వామి వారి సేవలో సత్యనారాయణ తరించారని, అయన స్వర్గస్తులైనా.. అయన కుమారుడు వెంటరాజు తన తండ్రి ఆశయాలను నిరవేరుస్తూ ఈ అన్నదానం నిర్వహించినట్టు తెలిపారు.
ఆధ్యాత్మికంగా పంచారామాల్లో ఒకటైన సామర్లకోట భీమేశ్వరస్వామి ఆలయం దేశవ్యాప్తంగా ప్రముఖ ఆలయాల్లో ఒకటి. తూర్పు గోదావరి జిల్లా రాజమండ్రికి 50కిలోమీటర్ల దూరంలో ఉంది. ఇక్కడి భీమేశ్వరుడిని కుమారస్వామి ప్రతిష్టించడం వల్ల కుమారారామ భీమేశ్వరం అనే పేరు వచ్చిందని చెబుతారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…