Movie News

FLASH.. భీమ్లా నాయ‌క్‌ టైటిల్ సాంగ్ వచ్చేసిందోచ్..! ఫ్యాన్స్ కు పవన్ బర్త్ డే ట్రీట్..!

సెప్టెంబర్ 2వ తేదీ ఈరోజు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ అభిమానులకు ఒక పండుగ రోజని చెప్పవచ్చు. నేడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా ఇప్పటికే రెండు తెలుగు రాష్ట్రాలలోని అభిమానులలో సోషల్ మీడియా వేదికగా పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు వేడుకలను భారీ ఎత్తున నిర్వహిస్తున్నారు.తమ అభిమాన నటుడు నటించిన పలు సినిమాలలోని ఫోటోలను, పలు వీడియోలను సోషల్ మీడియా వేదికగా షేర్ చేస్తూ పుట్టినరోజు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు.

ప్రస్తుతం పవన్ కళ్యాణ్ పలు సినిమాలతో బిజీగా ఉన్న సంగతి మనకు తెలిసిందే. నేడు తన పుట్టినరోజు కావడంతో తన సినిమాల నుంచి సరికొత్త అప్డేట్ లను విడుదల చేస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్నారు. ఈ క్రమంలోనే పవన్ కళ్యాణ్ సాగర్ కే చంద్ర దర్శకత్వంలో నటిస్తున్నటువంటి చిత్రం “భీమ్లా నాయక్” . ఇందులో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ పాత్రలో సందడి చేయనున్నారు. అలాగే రానా కూడా ఇందులో ఓ కీలక పాత్రలో నటిస్తున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన ఫస్ట్ గ్లింప్ సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రెండ్ అవుతూ ఎంతో మంది అభిమానులను ఆకట్టుకుంది. ఇందులో పవర్ స్టార్ పంచెకట్టులో “రేయ్ డానీ బయటికి రా.. రా నా కొడకా అంటూ”.. పవన్ చెప్పిన డైలాగులు అభిమానులను తెగ సందడి చేశాయి. ఇప్పటికీ ఈ గ్లింప్ సోషల్ మీడియాలో పెద్దఎత్తున ట్రెండ్ అవుతోంది.

ఇదిలా ఉండగా నేడు పవర్ స్టార్ పుట్టినరోజు కావడంతో భీమ్లా నాయక్ చిత్రం నుంచి కొన్ని నిమిషాల క్రితం భీమ్లా నాయక్ టైటిల్ సాంగును విడుదల చేశారు. ఈ సాంగ్ ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఎంతోమంది అభిమానులను సందడి చేస్తోంది.పవన్ కళ్యాణ్ పుట్టిన రోజు సందర్భంగా అభిమానులకు మంచి ట్రీట్ ఇచ్చారని చెప్పవచ్చు. ఈ పాట సోషల్ మీడియా లో వైరల్ అవుతూ సినిమాపై భారీ అంచనాలను క్రియేట్ చేస్తోంది. మరింకెందుకాలస్యం భీమ్లా నాయక్ టైటిల్ సాంగ్ పై మీరు ఓ లుక్కేయండి.సాగర్ కే చంద్ర దర్శకత్వంలో ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న ఈ చిత్రాన్ని పీడీవీ ప్రసాద్ సమర్పణలో సితార ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై సూర్య దేవర నాగవంశీ నిర్మించగా ఎస్.ఎస్. తమన్ సంగీతం సమకూర్చారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago