వెంకీ థిస్ ఇస్ పింకీ అంటూ నువ్వు నాకు నచ్చావ్ సినిమా ద్వారా అల్లరి చేష్టలు, తుంటరి పనులు చేస్తూ ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న పింకీ ప్రతి ఒక్కరికి గుర్తుండే ఉంటుంది.ఈ సినిమా ద్వారా ఎంతో మంచి గుర్తింపును సంపాదించుకున్న పింకీ చైల్డ్ ఆర్టిస్ట్ గా ఎన్నో సినిమాలలో నటించి ఆ తర్వాత చెల్లెలి పాత్రలో నటించి అందరినీ మెప్పించారు. అయితే ఈ మధ్య కాలంలో వెండి తెరకు దూరమైన పింకీ అసలు పేరు సుదీప ప్రస్తుతం ఈమె ఎక్కడ ఉంది ఏం చేస్తుంది అని విషయానికి వస్తే..
1994 సంవత్సరంలో మోహన్ బాబు హీరోగా తెరకెక్కిన ఏమ్. ధర్మరాజు M.A రంభ చెల్లెలి పాత్రలో సుదీప మొట్టమొదటిసారిగా వెండితెరపై కనిపించారు. ఈ సినిమా తర్వాత సుదీప ఎన్నో సినిమాలలో నటించారు. ఈ సినిమాలో నటించే అవకాశం సుదీపకు వారి తాతయ్య ద్వారా దక్కింది. ఇక సుదీప తల్లిదండ్రులు కూడా క్లాసికల్ డాన్సర్స్ కావడంతో ఈమె కూడా చిన్నతనంలోనే క్లాసికల్ డాన్స్ నేర్చుకుంది.
తన తాతయ్య సహకారంతో సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన సుదీప ఆ తర్వాత మా అన్నయ్య, అల్లుడుగారు వచ్చారు వంటి సినిమాల్లో నటించినప్పటికీ రాని గుర్తింపు 2001 సంవత్సరంలో విజయభాస్కర్ దర్శకత్వంలో వెంకటేష్ ఆర్తి అగర్వాల్ జంటగా నటించిన నువ్వు నాకు నచ్చావ్ సినిమాలో పింకీ పాత్రలో సందడి చేశారు.
ఈ సినిమా ఈమెకు ఎంతో మంచి గుర్తింపును తీసుకువచ్చింది.ఈ సినిమా తర్వాత ఈమె పేరు సుదీప పింకీ గా మారి పోయింది. ఈ సినిమాతో మంచి గుర్తింపును సంపాదించుకున్న సుదీప ఆ తర్వాత ఎన్నో సినిమా అవకాశాలు వచ్చినప్పటికీ ఆమె సెంటిమెంట్ చెల్లెలి పాత్రలో నటించారు. ఎప్పుడూ ఒకే రకమైన పాత్రలో నటించడం బోర్ కొట్టిన సుదీప తరువాత బుల్లితెరపై ఎంట్రీ ఇచ్చారు.
బుల్లితెరపై పలు సీరియల్స్ లో నటించిన ఈమె మంచి గుర్తింపు తెచ్చుకుంది. ఇక హీరోయిన్ గా ప్రయత్నాలు కొనసాగినప్పటికీ ఆమె ఎత్తు సమస్య కారణంగా ఎలాంటి అవకాశాలు రాలేదు. సినిమాలలో నటిస్తున్న ఎంబీఏ పూర్తి చేసిన సుదీప శ్రీ రంగనాథ్ అనే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ ను పెళ్లి చేసుకొని హైదరాబాద్ లో సెటిల్ అయ్యారు. చిన్నప్పటి నుంచి క్లాసికల్ డాన్స్ నేర్చుకోవడంతో ఈమె ప్రస్తుతం ఒక క్లాసికల్ డాన్స్ స్కూల్ నిర్వహించడమే కాకుండా పలు స్కూల్ లలో క్లాసికల్ డాన్స్ టీచర్ గా కూడా పని చేస్తున్నారు.
తెలంగాణలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. ముఖ్యంగా హైదరాబాద్ సహా పలు జిల్లాలకు భారత వాతావరణ శాఖ ఆరెంజ్ అలర్ట్…
పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ నటిస్తున్న ప్రతిష్ఠాత్మక చిత్రం ఫౌజీ చుట్టూ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. ఈ సినిమాలో…
మహారాష్ట్రలో సంచలనం రేపిన లైంగిక వేధింపుల కేసులో ప్రభుత్వం కఠిన చర్యలు ప్రారంభించింది. పరాత్వడ పట్టణానికి చెందిన మహమ్మద్ అయాజ్…
టాలీవుడ్‌లో అభిమానులను ఆందోళనకు గురిచేసిన వార్తపై స్పష్టత వచ్చింది. మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ గాయపడిన ఘటనపై ఆయన సోదరి…
తెలంగాణలో సంచలనం సృష్టించిన భారీ బ్యాంకు మోసం వెలుగులోకి వచ్చింది. నల్లగొండ జిల్లా దేవరకొండలోని స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా…
తమిళనాడులో ఎన్నికల వేళ కీలక పరిణామం చోటుచేసుకుంది. డీఎంకే నేత, మంత్రి ఉదయనిధి స్టాలిన్ సమర్పించిన ఎన్నికల అఫిడవిట్‌లోని ఆస్తుల…