Bichagadu Movie: తమిళ హీరో విజయ్ ఆంటోనీ నటించిన బిచ్చగాడు సినిమా అటు తమిళ్ భాషతో పాటు తెలుగులో కూడా మంచి హిట్ అందుకుంది. ఇక ఆ సినిమా సూపర్ హిట్ అవటంతో విజయ్ ఆంటోనీ బిచ్చగాడు సీక్వెల్ ని తెరకెక్కించారు. బిచ్చగాడు 2 గా ఈ సినిమా ప్రేక్షకుల ముందుకి రానుంది. విజయ్ ఆంటోనీ స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా మే 19 న తెలుగు, తమిళ్ భాషలలో ప్రేక్షకుల ముందుకి రానుంది.
ఈ సినిమాలో విజయ్ ఆంటోనీ కి జంటగా కావ్య థాపర్ నటించింది. ఇక ఫాతిమా విజయ్ ఆంటోనీ ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. ఇక తెలుగులో ఉషా పిక్చర్స్ బ్యానర్ పై విజయ్ కుమార్, వీర నాయుడు విడుదల చేయనున్నారు. ఇక సినిమా విడుదల తేదీ దగ్గర పడటంతో సినిమా ప్రమోషన్ పనులు జోరుగా సాగుతున్నాయి. ఈ ప్రమోషన్ పనులలో భాగంగా ఇటీవల హైదరాబాద్ లో ఫ్రీ రిలీజ్ ఈవెంట్ ని ఘనంగా నిర్వహించారు.
ఈ ఈవెంట్ కి హీరో అడవి శేషు, దర్శకుడు పూరి జగన్నాథ తనయుడు ఆకాష్ పూరీ అతిధులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆకాష్ పూరీ మాట్లాడుతూ…ఇంతకాలం విజయ్ ఆంటోనీ అంటే ఇష్టం ఉండేది..కానీ ఇప్పుడు ఆయన్ని కలిసిన తర్వాత ఆయన మీద గౌరవం మొదలైంది అంటూ చెప్పుకొచ్చాడు. బిచ్చగాడు 2 సినిమా మంచి హిట్ అవ్వాలని కోరుకుంటున్నట్లు తెలిపాడు.
ఇక అడవి శేష్ మాట్లాడుతూ…” సాధారణంగా సినిమా కోసం ప్రాణం పెట్టీ తీసామని అందరూ అంటారు. కానీ బిచ్చగాడు2 కోసం విజయ్ ఆంటోనీ, ఫాతిమా నిజంగా ప్రాణం పెట్టీ పని చేశారు. వారి కష్టానికి ప్రతిఫలంగా ఈ సినిమా హిట్ అవ్వాలి అంటూ అడవి శేష్ చెప్పుకొచ్చాడు. బిచ్చగాడు సినిమాలో తల్లి కొడుకుల మధ్య ఉన్న అనుబంధం ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యింది. దీంతో ఆ సినిమా మంచి విజయం అందుకుంది. ఇక మే 19 న విడుదల కాబోతున్న బిచ్చగాడు 2 సినిమాలో కూడా అన్న చెల్లి మద్య అనుబంధం చాలా చక్కగా చూపించబోతున్నట్లు తెలుస్తోంది. ఈ సినిమా ప్రేక్షకులకు తప్పకుండా నచ్చుతుందని విజయ్ ఆంటోనీ తెలిపాడు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…