Featured

Big Boss : అందరిలోనూ ఆసక్తి పెంచుతున్న బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే… ఇంతకీ రామ్ చరణ్ హోస్ట్? ఆర్ గెస్ట్?

Big Boss : బిగ్ బాస్ ప్రోగ్రాం తెలియని వారు కూడా వుంటారా అంటే అది అతిషయోక్తి కాదు. అంతలా బిగ్ బాస్ అందరికి చేరువ అయ్యింది. తెలుగు బుల్లితెర చరిత్రలోనే భారీ స్థాయిలో స్పందనను సంపాదించుకుని. దేశంలోనే అత్యధికంగా టీఆర్పీ రేటింగ్‌ రాబడుతున్న బిగ్గెస్ట్ రియాలిటీ షోగా బిగ్ బాస్ రానిస్తోంది. తెలుగులో బిగ్ బాస్ ఇప్పటికే ఐదు సీజ‌న్లు పూర్తి చేసుకుంది. ఈ సంద‌ర్బంగా ఈ షోను ఇప్పుడు ఓటీటీలో కూడా ప్ర‌సారం చేస్తున్నారు. సాధారణంగా టీవీ ప్రోగ్రాంకాకు వుండే సరిహద్దులంటూ ఏమి లేని కంటెంట్‌తో బిగ్ బాస్ అభిమానులకు వినోదాన్ని పంచుతోందీ.

ఈ ఓటీటీ బిగ్ బాస్ కి కూడా నాగార్జున హోస్ట్ గా వ్యవహారిస్తున్నారు. మొదట 17 మంది కంటెస్టెంట్ లతో ప్రారంభమైన ఈ ఓటీటీ బిగ్ బాస్ కార్యక్రమంలో ప్రస్తుతం ఏడుగురు కంటెస్టెంట్ లు ఉన్నారు. ఈ ఏడుగురిలో బిందుమాధవి ఇంకా అఖిల్ మధ్య టైటిల్ పోరు కూడా నడుస్తోంది. ఫినాలేకు ముందు జరిగే ఎలిమినేషన్ ప్రక్రియకు సంబందించిన లీకులు బయటకు వచ్చాయి. ప్రస్తుతం ఈ ప్రోగ్రాం లో ఏడు మంది కంటెస్టెంట్ లు ఉండగా శుక్రవారం ఒకరిని, శనివారం ఒకరిని బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపిస్తున్నట్లు సమాచారం. అలాగే ఆదివారం జరిగే గ్రాండ్ ఫినాలే లో విజేతను ప్రకటిస్తారు. అంతే కాదు లీకుల ప్రకారం చివరి కంటెస్టెంట్లు గా బాబామాస్ట‌ర్ ఇంకా అనీల్ బిగ్ బాస్ హౌస్ నాన్‌స్టాప్ షోకి ఎలిమినేట్ అవుతున్నారట. అంటే టాప్ 5 లిస్ట్ లో బాబా, అనీల్ ఉండ‌ర‌ని వార్తలు వస్తున్నాయి.

రామ్ చరణ్ హోస్ట్ గా చేస్తున్నారా……

అయితే ఈ కార్యక్రమానికి సంబందించిన గ్రాండ్ ఫినాలే మూడు రోజుల పాటు ఘనంగా జరుగుతుందని సమాచారం. శుక్రవారం నుంచి ఆదివారం వరకు ఈ వేదుకాలు జరుగుతాయట. అయితే తాజా సమాచారం ప్రకారం బిగ్ బాస్ గ్రాండ్ ఫినాలే రోజున జరిగే కార్యక్రమానికి హోస్ట్ గా నాగార్జున డుమ్మా కొట్టినట్లు సమాచారం. నాగార్జున గ్రాండ్ ఫినాలే కార్యక్రమానికి హోస్ట్ గా అందుబాటులో ఉండకపోతే ఈయన స్థానంలోకి హీరో వెంకటేష్ లేదా హీరో రామ్ చరణ్ హోస్ట్ గా బాధ్యతలు నిర్వహిస్తారని తెలుస్తోంది. అయితే వీరిద్దరిలో కూడా దాదాపుగా రామ్ చరణ్ ఈ గ్రాండ్ ఫినాలే కి హోస్ట్ గా వ్యవహరిస్తారని వార్తలు. గ్రాండ్ ఫినాలేలో ఎక్కువ మొత్తం రామ్ చ‌ర‌ణ్ సంద‌డి చేస్తార‌ని సమాచారం. ఇక దీనిపై మ‌రి కొద్ది గంట‌ల‌లో అభిమానుల లోని ఆతృతకు చెక్ పడుతుంది.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago