Big boss contestant Revanth Mother : బిగ్ బాస్ సీజన్ 6 తెలుగు చివరి అంకం కి వచ్చేసింది. టాప్ 5 లో ఎవరు ఉన్నారు టాప్ 1 గా నిలిచేది ఎవరు అన్న క్లారిటీ అప్పుడే చాలా మందిలో వచ్చేసింది. సింగర్ రేవంత్ మొదటి నుండి బిగ్ బాస్ లో స్ట్రాంగ్ కంటెస్టెంట్. ఓటింగ్ లో టాప్ ప్లేసులో లో ఉంటూ టాప్ 5 లో ఖచ్చితంగా ఉండే ఇంటి సభ్యుడిగా ఆల్రెడీ ఫిక్స్ అయిపోయిన వ్యక్తి. ఇక ఇంట్లో అందరూ తనని వ్యతిరేకించిన ఏం చేసిన స్ట్రాంగ్ గా గేమ్ ఆడుతు వచ్చాడు . ఇక అలానే బయట ఎంతో మంది ఫ్యాన్స్ను సంపాదించుకున్నాడు. ఓ వైపు గేమ్, మరోవైపు టాస్కులు మరోవైపు గొడవలు ఇలా అన్నింటిలోనూ రేవంత్ ఉన్నాడు. దాదాపు బిగ్ బాస్ విన్నర్ రేవంత్ అవుతాడు అన్న అంచనాల నడుమ రేవంత్ తల్లి తాజాగా యూట్యూబ్ ఛానెల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూ లో ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
రేవంత్ కి ఉన్న లోటు అది ఒక్కటే….
రేవంత్ తన తల్లి తో ఒక స్నేహితుడి లాగా ఉంటాడు. బిగ్ బాస్ ఫ్యామిలీ టైములో కూడా ఇద్దరు అలానే మాట్లాడుకున్నారు. అయితే రేవంత్ ను మూడు నెలల తరవాత చూడగానే రేవంత్ తల్లి ఒక్కసారిగా ఎమోషనల్ అయి ఏడ్చేశారు. ఇక ఈ విషయం గురించి చెబుతూ ఎపుడు రేవంత్ ని అన్ని రోజులు చూడకుండా ఉండలేదని అందుకే చాలా ఎమోషనల్ అయినట్టు తెలిపారు.
ఇక రేవంత్ కూడా ఏడ్చేశాడంటూ తెలిపారు. రేవంత్ ఇంకా తన కడుపులో ఉన్నపుడే తండ్రి మరణించాడని తన తండ్రిని ఒకసారి కూడా చూడలేదు, ఆది తలచుకున్నపుడు బాధేస్తుందని జీవితంలో వాడికి ఉన్న లోటు అది మాత్రమే అంటూ చెప్పారు రేవంత్ తల్లి. ఖచ్చితంగా రేవంత్ బిగ్ బాస్ విన్నర్ అవుతాడంటూ చెప్పారు. టాప్ 2 లో శ్రీహన్ ఉంటాడని వాళ్లిద్దరి ఫ్రెండ్షిప్ ఎపుడు ఇలానే ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…