Featured

Big boss Galata Geethu : మా ఆయనకి ఏదో మందు పెట్టావని ఆదిరెడ్డి భార్య కవిత నాతో గొడవపడింది…: బిగ్ బాస్ గీతూ

Big Boss Galata Geethu : గీతూ చాలా చలాకిగా, తన చిత్తూరు యాసతో మాట్లాడుతూ అందరినీ ఆకట్టుకుంది. మొదట్లో టిక్ టాక్, ఇంస్టాగ్రామ్ రీల్స్ తో ఫేమ్ అయిన గీతూ ఆ తరువాత జబర్దస్త్, శ్రీ దేవి డ్రామా కంపెనీ వంటి షోలలో అలరించింది. ఇక బిగ్ బాస్ అవకాశం రావడంతో ఒక్కసారిగా లైంలైట్ లోకి వచ్చేసింది. ఇక బిగ్ బాస్ లో టాప్ 5 లో ఉంటుంది అనుకున్న గలాటా గీతూ ఎలిమినేట్ అయిపోయింది. బిగ్ బాస్ మొదటి నాలుగు వారాలు బిగ్ బాస్ మొత్తం గీతూ చుట్టే తిరిగింది. ఓ వైపు గొడవలు మరో వైపు కామెడీ అంటూ చలాకిగా ఇంటి సభ్యులనే కాకుండా ప్రేక్షకులను కూడా ఎంటర్టైన్ చేసిన గీతూ ఎలిమినేషన్ అందరినీ షాక్ కి గురిచేసింది. ఇక బిగ్ బాస్ అయిపోయినా ఇంకా బిగ్ బాస్ ఇంటి ముచ్చట్లను మిగిలిన కంటెస్టెంట్స్ గురించి చెబుతూ ఇంటర్వ్యూ చేస్తోంది గీతూ .

కవిత నాతో గొడవపడింది…

బిగ్ బాస్ లో అది రెడ్డి, గీతూ మొదటి నుండి బాగా ఉండేవారు. ఆదిరెడ్డి గీతూ కోసం పనులు చేస్తున్నాడు అనేలా వారిద్దరూ ఉండేవారు. అయితే అంతవరకు అమ్మాయిలతోనే మాట్లాడని అది రెడ్డి గీతూతో మాత్రం త్వరగా కలిసిపోయాడు అందుకే గీతూ ఏదో మందు పెట్టింది మా ఆయనకి అంటూ ఆదిరెడ్డి భార్య కవిత గీతూ తో గడవ పడిందని ప్రచారం జరిగింది. ఇక ఇదే విషయం మీద గీతూకి తాజాగా ఒక ఇంటర్వ్యూలో ప్రశ్న ఎదురుకాగా అలాంటిదేమీ లేదని నేను, ఆదిరెడ్డి మంచి స్నేహితులం అయ్యామని, అందులో ఆదిరెడ్డి భార్య కవితకి అభ్యంతరం లేదని చెప్పింది.

పల్లెటూరు నుండి వచ్చిన అమ్మాయి కావడం వల్ల బిగ్ బాస్ మొదట్లో ఆదిరెడ్డి నాతో మాట్లాడటం చూసి అంతవరకు తన భర్త ఏ అమ్మాయితోనూ మాట్లాడలేదు ఇప్పుడు మాట్లాడుతున్నాడనే జలస్ ఫీల్ అయిందట ఆదిరెడ్డి భార్య కవిత, ఈ విషయాన్ని గీతూ ఇంటర్వ్యూలో పంచుకుంది. అయితే గీతికా ఎలిమినేట్ అయ్యాక కవిత తో ఫోన్ లో మాట్లాడినపుడు కూడా చాలా బాగా మాట్లాడిందని మొదట్లో నీపై కోపం ఉండేది తరువాత అర్థమైందని కవిత చెప్పిందట. ప్రస్తుతం కవిత, ఆదిరెడ్డి తో కలిసి బయటకి కూడా వెళ్ళాం అలానే కొన్ని వీడియోస్ కూడా చేసాము అంటూ గీతూ క్లారిటీ ఇచ్చింది.

Bhargavi

Recent Posts

నిరుద్యోగులకు గుడ్‌న్యూస్.. ఉచిత బ్యాంక్ కోచింగ్ ప్రారంభం

తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…

2 hours ago

ప్రభాస్, రవితేజతో హిట్స్.. కానీ కెరీర్‌ను వదిలేసిన హీరోయిన్

టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…

2 hours ago

నాగార్జున నమ్మకం లేకపోతే ఆర్జీవీ కెరీర్ ముగిసేది: జేడీ

టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…

2 hours ago

బాల్య వివాహం ఆపాలని వెళ్లి.. తప్పు బాలికను తీసుకెళ్లిన అధికారులు

తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…

2 hours ago

‘టాక్సిక్’లో కొత్త కోణం.. దర్శకురాలిపై యశ్ ప్రశంసలు

కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…

2 hours ago

కేసీఆర్‌కు సవాల్.. కవిత కొత్త పార్టీ ప్రకటన

తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…

2 hours ago