Senior Actor PR Varalakshmi : నగరి కి చెందిన పిఆర్ వరలక్ష్మి గారు తెలుగులోనే కాకుండా తమిళం, కన్నడ హిందీ, మలయాళం ఇలా పలు భాషల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. వందల సినిమాల్లో నటించిన వరలక్ష్మి గారు ‘కృష్ణావతారం’ సినిమా ద్వారా తెలుగులో పరిచయమయ్యారు. ఎన్టీఆర్, ఏఎన్ఆర్, కృష్ణ, కృష్ణం రాజు ఇలా అందరు హీరోలతో నటించిన ఆమె మహేష్ బాబు, బాలకృష్ణ ఇలా తరువాత తరం వారితోను నటించారు. తమిళంలో సీరియల్స్ లో నటిస్తున్న వరలక్ష్మి గారు ప్రస్తుతం సినిమాలకు దూరంగా ముఖ్యంగా తెలుగు ఇండస్ట్రీకి దూరంగా ఉంటున్నారు. తన వ్యక్తిగత జీవితంలో ఎదుర్కొన్న ఇబ్బందులను ఇంటర్వ్యూలో పంచుకున్నారు వరలక్ష్మి.
లవ్ మ్యారేజ్… విడిపోడానికి కారణం…
వరలక్ష్మి గారి దాదాపు అందరు అగ్రహీరోలతో నటించి అప్పట్లో బిజీ ఆర్టిస్ట్ గా ఉండేవారు. అలాంటి సమయంలోనే ప్రేమించి ఇరు వైపులా పెద్దలు ఒప్పుకోక పోయేసరికి గుడికి వెళ్లి అక్కడే పెళ్లి చేసుకున్నారట వరలక్ష్మి దంపతులు. ఇక ఆపై ఇంట్లో వాళ్లను ఒప్పించుకుని హ్యాపీగా వైవాహిక జీవితంలో ఉండగా చిన్న చిన్న మనస్పర్తల కారణంగా విడిపోవాల్సి వచ్చిందంటూ చెప్పారు. ఇంజనీరింగ్ లో గోల్డ్ మెడలిస్ట్ అయిన తన భర్త అప్పట్లోనే బాగా సంపాదించేవారని, నాకు అప్పట్లో ఒక సినిమాకు 50 వేలు ఇచ్చేవరని అది చాలా చిన్న అమౌంట్ గా ఆయనకు అనిపించేదంటూ చెప్పారు. అయితే చాలా మంచి వ్యక్తి అని, నా తప్పు వల్లే విడిపోవాల్సి వచ్చిందంటూ చెప్పారు. డబ్బు విషయంలో మొదటి నుండి స్వేచ్ఛగా ఉంటూ నాకు నచ్చినట్లు చేసేదాన్ని అలా స్నేహితులు సినిమా నిర్మాణం కోసం ఫైనాన్స్ అడిగారని ఇల్లు అమ్మి ఇచ్చాను, అది ఆయనను అడగలేదు.
ఇక ఆయన అడిగినా ఇంకో ఇల్లు కొనుక్కోవచ్చు దాంట్లో ఏముంది అనే ధోరణిలో చెప్పాను, అది నచ్చక దాదాపు రెండేళ్లు కోపంతో మాట్లాడలేదు. ఆపైన గొడవ ఎప్పటికప్పుడు పెద్దగా మారి చివరకు విడిపోయాము. తానే విడాకులు అడిగితే అందరూ తనను తప్పు అనుకుంటారని నేనే విడాకులు ఇస్తానని చెప్పి ఇచ్చేసాను, విడిపోయాక అమెరికా వెళ్లిపోయారు. ప్రస్తుతం ఆయన బ్రతికి ఉన్నారో లేక మరణించారో అనే విషయం కూడా నాకు తెలియదు. విడిపోయాక ఇంకెప్పుడూ ఆయనతో మాట్లాడలేదు. నేను బాధపడుతానని నా కూతుర్లు తండ్రి గురించి మాట్లాడరు, అలానే అడగరు అంటూ చెప్పారు వరలక్ష్మి.
తెలంగాణలో నిరుద్యోగ యువతకు ఊరటనిచ్చే నిర్ణయం వెలువడింది. తెలంగాణ గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో బ్యాంకింగ్ పరీక్షలకు సిద్ధమవుతున్న అభ్యర్థులకు…
టాలీవుడ్‌లో తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు పొందిన రిచా గంగోపాధ్యాయ్ సినీ ప్రయాణం ఇప్పటికీ ఆసక్తికర చర్చగా నిలుస్తోంది.…
టాలీవుడ్‌లో క్లాసిక్‌గా నిలిచిన ‘శివ’ సినిమా గురించి మరో ఆసక్తికర విషయాన్ని నటుడు జేడీ చక్రవర్తి వెల్లడించారు. ప్రస్తుతం తన…
తెలంగాణలోని గద్వాల జిల్లాలో చోటుచేసుకున్న ఓ ఘటన అధికారుల నిర్లక్ష్యంపై తీవ్ర విమర్శలకు దారి తీసింది. బాల్య వివాహాన్ని అడ్డుకోవడానికి…
కన్నడ స్టార్ హీరో యశ్ నటిస్తున్న ‘టాక్సిక్’ సినిమా విడుదలకు ముందు నుంచే సినీ వర్గాల్లో భారీ చర్చకు దారి…
తెలంగాణ రాజకీయాల్లో కొత్త చర్చకు దారి తీసే పరిణామం చోటుచేసుకుంది. బీఆర్ఎస్‌కు దూరమైన కల్వకుంట్ల కవిత, తన రాజకీయ ప్రయాణాన్ని…