Big Boss House : బిగ్‌బాస్ హౌస్.. బుల్లితెర మీద ఒక సంచలనం అనే చెప్పాలి. తెలుగులో కూడా బిగ్‌బాస్ విజయవంతంగా అయిదు సీజన్లు పూర్తి చేసుకుంది. అంతేకాదు బిగ్‌బాస్ ఓటీటీ కి కూడా అభిమానుల నుండి మంచి ఆదరణ లభించింది. బుల్లితెర మీద ఇప్పటికే 5 సీజన్లు పూర్తి చేసుకున్న బిగ్‌బాస్ ఆరవ సీజన్ కి సిద్ధమవుతోంది. సెప్టెంబర్ 4న ఆరవ సీజన్ ప్రేక్షకుల ముందుకు రాబోతుండగా అభిమానులు ఎదురుచూస్తున్నారు. బిగ్ బాస్ హౌస్ లోకి కంటెస్టెంట్ లుగా వెళితే డబ్బు తో పాటు క్రేజ్ సంపాదించుకోవచ్చు, దీని వల్ల ఇండస్ట్రీలో అవకాశాలు క్యూ కడతాయి అనుకునే వారు. కానీ తాజాగా కొంతమంది కామెంట్ల వలన ఇది తప్పు అనే భావన కలుగుతోంది.
బిగ్‌బాస్ హౌస్ లోకి వెళితే డిప్రెషన్ పక్కా…
బిగ్‌బాస్ హౌస్ లో మా నడవడిక, చేసే పనులను బట్టి మా మీద ఒక అభిప్రాయాన్ని ఏర్పారుచుకోవడమే కాక, బయటకు వచ్చాక ట్రోలింగ్స్, నెగిటివ్ కామెంట్స్ తో డిప్రెషన్ లోకి వెళ్తున్నాము అని గత బిగ్‌బాస్ హౌస్ కంటెస్టెంట్ లు అయిన గీతా మాధురి, వితిక సెరు కామెంట్లు చేయడం తెలిసిందే. ఇక ఈ మధ్య సీజన్ 2 కంటెస్టెంట్ తేజస్వి మడివాడా అయితే మరో అడుగు ముందుకు వేసి కౌశల్ ఆర్మీ వలన డిప్రెషన్ లోకి వెళ్లి మందుకు బానిస అయ్యాను అని సంచలనంగా మాట్లాడింది.
ఇక ఇపుడు నాలుగవ సీజన్ కంటెస్టెంట్ అయిన సింగర్ నోయల్ బిగ్ బాస్ హౌస్ నుంచి చివర్లో అనారోగ్య కారణాల వలన బయటకు వచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న నోయల్.. బిగ్‌బాస్ గురించి అడుగగా.. ఇద్దరు వ్యక్తుల మధ్య గొడవలు జరగడం, అవతలి వ్యక్తి డిప్రెషన్ లోకి వెళ్లడం జరుగుతుంది. ఇక మనం కూడా గొడవ వలన డిప్రెషన్ లోకి వెళతాం. ఇక్కడ డిప్రెషన్ లోకి వెళ్లడం అయితే పక్కా.. అని చెప్పుకోచ్చాడు. వీళ్ళ కామెంట్లు విన్న నెటిజన్లు మాత్రం బిగ్‌బాస్ కి వెళితే డిప్రెషన్ లోకి వెళతారేమో అన్న అనుమానాలు వ్యక్తపరుస్తున్నారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…