Featured

Big boss Keerthi bhat : పెళ్లి చేసుకోబోతున్న బిగ్ బాస్ కీర్తి భట్… పిల్లలు పుట్టరని తెలిసినా… వరుడు ఎవరంటే…!

Big boss Keerthi bhat : బిగ్ బాస్ సీజన్ 6 కాంటెస్టంట్ గా అడుగుపెట్టిన కీర్తి జీవితం ఒక విషాదం. ఎవరికైనా జీవితంలో అనుకోని కష్టాలు కామన్ కానీ కీర్తికి కష్టాలే జీవితం అయిపోయాయి. ధర్మస్థలం వెళ్లి వస్తూ కారు ప్రమాదంలో తల్లిదండ్రులను, అన్న వదిన వాళ్ళ పాప అందరినీ కోల్పోయింది కీర్తి. ఇక తండ్రి మరణం తట్టుకోలేక కోమాలోకి వెళ్ళి 32 రోజులు కోమాలో ఉండి ఆ తరువాత కోలుకున్నాక బంధువులతో ఆస్తి తాగదాలు. కీర్తి ఈ కష్టాలను దాటుకుని కాల్ సెంటర్ లో పనిచేస్తూ ఆ తరువాత హెచ్ఆర్ గా ఒక కంపెనీ లో పనిచేస్తూ తండ్రి కోసం ఒక పాపను దత్తత తీసుకుంది. అయితే బిగ్ బాస్ కి వచ్చే ముందు ఆ పాప మరణించింది. అలా జీవితములో కష్టాలనే చూస్తూ వచ్చిన కీర్తి జీవితంలో వెలుగొచ్చింది.

బుల్లితెర మీద ఘనంగా ఎంగేజ్మెంట్ చేసుకున్న కీర్తి, కార్తీక్…

కీర్తి జీవితంలో నేడు కొత్త అధ్యాయం మొదలయింది. కన్నవాళ్లు, పెంచుకున్న పాప ఇలా అందరూ దూరం అయిన పోరాడుతునే జీవిస్తున్న కీర్తికి తోడుగా జీవితాంతం ఉంటానంటూ కార్తీక్ నిలబడ్డాడు. నటుడు విజయ్ కార్తీక్ తోట తో కీర్తి నిశ్చితార్థం ఘనంగా జరిగింది. ఈ ఎంగేజ్మెంట్ ను మా టీవిలో చేయగా ఈ వేడుకకు సంబంధించిన ప్రోమోలో కీర్తి, కార్తీక్ దండలు మార్చుకున్నారు. ‘నీకు నేను తోడుగా ఉంటాను, నీ తల్లిదండ్రులను నా పేరెంట్స్ అనుకుంటా, నన్ను వదలకుండా ఇలాగే చూసుకో’ అంటూ కంటతడి పెట్టుకుంది కీర్తి. తర్వాత ఈ జంట రింగ్స్ మార్చుకున్నారు. కార్తీక్ పేరెంట్స్ గురించి కీర్తి చెబుతూ.. ‘నేను వారి వంశాన్ని నెక్స్ట్ లెవల్‌కి తీసుకెళ్లలేనని తెలుసు ఆ విషయాన్ని వాళ్లకి చెప్తే ఒకటే మాట అన్నారు నీకు పిల్లలు లేకపోయినా పర్వాలేదు నువ్వు మా బిడ్డ అనుకుంటాం. మనం ఒక పాపను దత్తత తీసుకుందామని చెప్పారంటూ భావోద్వేగానికి గురైంది కీర్తి.

గతంలో ఆక్సిడెంట్ వల్ల పిల్లలు పుట్టే అవకాశం లేని కీర్తి పాపను దత్తత తీసుకుంది. అయితే ఆ పాప మరణించడంతో బాగా క్రుంగిపోయింది. ఇక కీర్తి కాబోయే భర్త విజయ్ కార్తిక్ తొలుత కన్నడ సినిమాల్లో హీరోగా చేసారు. ఆపైన తెలుగు ఇండస్ట్రీకి వచ్చిన తను పలు సినిమాల్లో నటించాడు. ప్రస్తుతం సీరియల్స్ లో బిజీగా ఉన్న కార్తీక్ త్వరలో కీర్తి ని పెళ్లి చేసుకోబోతున్నారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago