Big Boss Neha Chowdary : బిగ్ బాస్ తెలుగులో మొదటి రియాలిటీ షో సీజన్ 6 మొదలై అపుడే ఎలిమినేషన్లు, గొడవలు అంటూ సాగుతోంది. బిగ్ బాస్ కొత్త సీజన్ ఎపిసోడ్స్ ప్రస్తుతం రేటింగ్స్ లేక విలవిలలాడుతోంది. షోలో కంటెస్టెంట్ల పెర్ఫార్మన్స్ సరిగా లేక చప్పగా ఉన్నాయి ఎపిసోడ్స్. అయితే ఇపుడిపుడే ఇంట్రెస్ట్ పెంచుతున్న బిగ్ బాస్ ఎలిమినేషన్లు, టాస్క్ ఆడేటపుడు గొడవలు, బూతులు తిట్టుకోవడం అన్నీ మొదలై ప్రేక్షకులకు ఇంట్రస్ట్ పుట్టిస్తున్నాయి.
నేహా కోసం బ్రియాన్ లారా…
బిగ్ బాస్ లో కంటెస్టెంట్లు ఎలిమినేషన్లో ఉన్నవారికి బయట మద్దతుగా వాళ్ళ సన్నిహితులు సోషల్ మీడియాలో ఓటు వేయండి అంటూ ప్రచారం చేయడం, ఇక అప్పుడప్పుడు సెలబ్రిటీలు కూడా వాళ్లకు నచ్చిన కంటెస్టంట్ కు ఓటు వేయమని చెప్పడం చూస్తూనే ఉన్నాం. అయితే ఇప్పుడు ఈ ప్రచారం ఖండాంతరాలు దాటాయి. నేహా చౌదరి కోసం ఏకంగా క్రికెట్ దిగ్గజం బ్రియాన్ లారా ఓటు చేయమని అడగడం అందరికీ ఆశ్చర్యాన్ని కలిగించింది.
నేహా టీవీ యాంకర్ గా పని చేసి ఆ తరువాత క్రికెట్ రిపోర్టర్ గా పనిచేసింది. ఇక అప్పుడున్న పరిచయం వల్లే బ్రియాన్ లారా నేహా కు మద్దతుగా నిలిచారు. ఓటు వేయమని ఆయన సోషల్ మీడియా ఖాతా ద్వారా అభిమానులను అభ్యర్థించారు. ఇక మరో కంటెస్టంట్ ఇనయ సుల్తానా కోసం ఆర్జీవి రంగంలోకి దిగారు. ఆయన కూడా ఇనయ తో దిగిన ఫోటోను సోషల్ మీడియాలో పోస్ట్ చేసి ఓటు వేయమని చెప్పడం ఆశ్చర్యకరం.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…