Categories: FeaturedMovie News

Flash Back : అన్న గారు ఎన్టీఆర్ ఆశీస్సులతో కృష్ణ చేసిన సాహసం ఏంటో తెలుసా?

Super Star Krishna : అలనాటి తెలుగు హీరోల్లో ట్రెండ్ ఫాలోయింగ్ అవకుండా సెట్ చేసిన వాళ్లలో కృష్ణ ముందుంటారు. కొత్తదానాన్ని సైన్మ ఇండస్ట్రీ కి పరిచయం చేసింది ఖచ్చితంగా సూపర్ స్టార్ కృష్ణ గారే. ఆయన కుటుంబం కథా చిత్రాలు తీసినా, కౌ బాయ్ సినిమాలు తీసినా గూఢచారి అంటూ వచ్చినా తెలుగు ప్రేక్షకులు ఆదరించారు. ఇక కృష్ణ గారి వారాసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు కూడా తండ్రికి తగ్గ తనయుడిగా నిరూపించుకున్నాడు. కృష్ణ గారికి అప్పట్లో మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉండేది. ఆయన నటించిన ఎన్నో సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద మంచి హిట్స్ గా నిలిచాయి. అలాగని కమర్షియల్ పంథాలో సినిమాలను కృష్ణ చేయలేదు. ఇక ఆయన సినిమాల్లోనే కాదు నిజంగా కూడా హీరోనే అని నిరూపించుకున్న ఘటన ఒకటి ఉంది.

కరువు కాలంలో సహాయం…

1972 లో ఆంధ్రప్రదేశ్ లో కరువు విలయ తాండవం చేసింది. అలాంటి సమయంలో పేపర్ లో ఆ వార్త చూసి చలించిన కృష్ణ గారు అన్న ఎన్టీఆర్ గారిని సలహా అడిగి నాటకాలు వేసి వసూలైన డబ్బులతో కరువు ప్రాంతం వారికి సహాయం చేయాలని భావించారు. ఇక విజయవాడ మొదలు రాజమండ్రి అలా మొత్తం కొన్ని ప్రాంతాలలో అందరి నటులతో కలిసి నాటకాలు వేసి డబ్బు సేకరించాలని కృష్ణ గారి ఇంట్లో సమావేశం ఏర్పాటు చేసి నిర్ణయం తీసుకున్నారు. ఇక ప్రభాకర్ రెడ్డి గారితో కలిసి ఈ పనికి పూనుకున్నారు. ‘విచిత్ర మనుషులు’ అనే నాటికను ప్రదర్శించాలని నిర్ణయించుకుని. సావిత్రి, జమున, కృష్ణ, రామకృష్ణ, పద్మనాభం, అల్లు రామలింగయ్య వంటి అగ్ర తారలందరూ నాటకాలు పాటలు పాడటం అలాగే హాస్య ప్రదర్శన వంటివి చేసారు. అయితే వీళ్ళు విజయవాడ బయలుదేరే సమయానికి విపక్షాల ఆందోళన నేపథ్యంలో ప్రభుత్వం వెళ్లకుండా విజయవాడకి నాటకప్రదర్శన వాయిదా వేసుకోమని చెప్పినా కృష్ణ గారు బెదరకుండా విజయవాడ మొత్తం నటీనటులతో బయలుదేరారు.

ఇక అక్కడకి వెళ్ళాక నాటక ప్రదర్శన మొదలయ్యాక కుండపోత వర్షము మొదలయింది. అయినా ప్రేక్షకులు వెళ్ళిపోలేదు అలాగే నిలబడి చూసారు. కానీ ఎంతకూ వర్షం తగ్గకపోవడం వల్ల ప్రదర్శన నిలిపి వేసి అదే టికెట్లకు మళ్ళీ ప్రదర్శన ఇస్తామని చెప్పి ప్రజలను వెనక్కి పంపారు. ఇక నాటకాన్ని మొదలు పెట్టింది ఎన్టీఆర్ గారు అయితే చివర్లో ముగించుకుని వచ్చాక అక్కినేని వారు సన్మాన సభ ఏర్పారు చేసారు. అక్టోబర్ లో మొదలు పెట్టి నవంబర్ లో నాటక ప్రదర్శన అన్ని ప్రాంతాల్లో ప్రదర్శించారు. ఇక ఈ మొత్తం సంఘటనలు మళ్ళీ అందరు నటీ నటులతో నటింపజేసి పద్మనాభం గారు సినిమాగా తీశారు. ఇక ఈ సినిమా కోసం ఎవరూ రెమ్యూనరేషన్ తీసుకోకపోవడం విశేషం.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago